Aishwarya Rajinikanth Second Marriage : ఈమధ్య కాలం లో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలెబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ వెళ్తుంది. ప్రతీ నెల ఒక సెలబ్రిటీ గురించి ఇలాంటి వార్తలను వింటూనే ఉన్నాము. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న దగ్గర నుండి అయితే ఈ వార్తలు చాలా కామన్ అయిపోయాయి. ఆమె తర్వాత చిరంజీవి చిన్న కూతురు విడాకులు తీసుకోవడం, నాగబాబు కూతురు కూడా రీసెంట్ గానే విడాకులు తీసుకోవడం, ఇలాంటి వార్తలను బోలెడన్ని వింటున్నాం. పెళ్లి శుభవార్తలు కంటే ఈ వార్తలే ఈమధ్య ఎక్కువ అయ్యాయి.
వీళ్లంటే కొత్తగా పెళ్ళైన వారు, కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయారు అనుకుందాం, కానీ పెళ్ళై రెండు దశాబ్దాలు దాటి, చెట్టంత కొడుకులు ఉన్నోళ్లు కూడా విడాకులు తీసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యపర్చిన విషయం. తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య (రజినీకాంత్ కూతురు) గత ఏడాది విడాకులు తీసుకున్న సంఘటన ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే(Aishwarya Rajinikanth Second Marriage). అయితే రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కోలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో తో ఆమె గత కొద్దీ రోజుల నుండి ప్రేమాయణం నడుపుతుందని,
బెంగళూరు లో వీళ్లిద్దరి కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం అక్కడ చాలా మంది చూసారని అంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ లో ఉంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కామన్, స్నేహం తో కూడా అలా తిరగొచ్చు, ఇలాంటి సందర్భాలు గతం లో ఎన్నో మనం చూశామని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇక రజినికాంత్ పెద్ద కూతురు సౌందర్య దర్శకురాలిగా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఐశ్వర్య రజినీకాంత్ కూడా ఒక దర్శకురాలే, ఇప్పటి వరకు ఈమె ఆరు సినిమాలకు దర్శకత్వం వహించింది.
ఈమె ప్రస్తుతం ‘లాల్ సలాం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. తమిళ హీరో విష్ణు విశాల్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో రజినీ కాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరి రాబొయ్యే రోజుల్లో ఈమె భవిష్యత్తు అటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగతం గా ఎలా ఉండబోతుందో చూడాలి. ఐతే ధనుష్ ప్రస్తుతం డి 46 అనే ఓకే తమిళ్ సినిమా లో నటిస్తున్నాడు, ఈ చిత్రానికి శేఖర్ కముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆగష్టు న సినిమాను రిలీజ్ చేదాం అనుకున్నారు సినిమా బృందం. ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి మరి.