Akhil Akkineni: ఈ ఏడాది భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం. ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారుగా మూడేళ్లు శ్రమించి ప్రముఖ ఇర్మాత అనిల్ సుంకర నిర్మించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో గొడవలు చాలానే జరిగాయి. అయినా కూడా షూటింగ్ ని ఓపిగ్గా కొనసాగించారు. ఈ చిత్రం కోసం ఆయన దాదాపుగా 70 కోట్ల రూపాయిలు బడ్జెట్ ని ఖర్చు చేసాడు. సినిమా ప్రకటించిన కొత్తల్లో మంచి క్రేజ్ ఉండేది కానీ , తర్వాత కరోనా కారణంగా వరుసగా వాయిదాలు పడడం తో మూవీ మీద ఉన్న హైప్ మొత్తం పోయింది.
దీనితో అప్పట్లో పలికిన బిజినెస్ వేల్యూ విడుదల సమయానికి 70 శాతం పడిపోయింది. ఇక చేసేది ఏమి లేక వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రీ ఫిలిమ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 30 కోట్ల రూపాయలకు నాన్ రిఫండబుల్ అమౌంట్ బేసిస్ క్రింద అమ్మేశాడు. కానీ విడుదల తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ రావడం తో 90 శాతం కి పైగా నష్టాలు వచ్చాయి(Akhil Akkineni). అంటే 30 కోట్లు పెట్టి కొంటె కనీసం 5 కోట్లు కూడా రాలేదు అన్నమాట. 20 శాతం కూడా రికవరీ అవ్వకపోతే కచ్చితంగా డబ్బులు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. అది రూల్, నిర్మాత అనిల్ శునకార కూడా ఇస్తాను అన్నాడు కానీ, ఆరు నెలల సమయం అడిగాడు.
కానీ గాయత్రి ఫిలిమ్స్ అధినేత మాత్రం మాకు మేము అమ్మిన బయ్యర్స్ నుండి చాలా ఒత్తిడిని ఎదురుకుంటున్నాము, తట్టుకోలేకపోతున్నాము, కనీసం మీరు వాళ్లకి ఒక లేఖ రాయండి అని అడగగా అనిల్ సుంకర అందుకు ఒప్పుకోలేదు. దీంతో గాయత్రీ ఫిలిమ్స్ అధినేత నిరసనకి దిగాడు. అనిల్ సుంకర తదుపరి చిత్రం భోళా శంకర్ విడుదల ని ఆపేయాల్సిందిగా కోర్టు లో పిటిషన్ వేసాడు. గాయత్రీ ఫిలిమ్స్ సంస్థ కి మొదటి నుండి మంచి పేరు ఉండేది అని, ఇప్పుడు ఏజెంట్ చిత్రం ద్వారా మొత్తం పోయిందని, బయ్యర్స్ అంటున్నారు.
మరి ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుంటుందో అసలు అనిల్ సుంకర నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. అక్కినేని కుటుంబంలో ఎవ్వరు కూడా నిలతోకుకోలేకపోతున్నారు, ఆఫర్లు రావటం లేదు లేదా వోచిన సినిమాలు అన్ని ప్లాప్ ఆ అవుతున్నాయి. అటు పక్క మెగా ఫామిలీ ఏమో దూసుకుపోతుంది. అక్కినేని వారు ఇప్పటికైనా మంచి కథ, దర్శకుడిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అని ఫాన్స్ లబో దిబో మన్తున్నారు. మరి వీరికి హిట్టు ఎపుడు ఏ సినిమాతో పడుతుందో వేచి చూడాల్సిందే.