Allu Arjun Flop Movies : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ తొలిసినిమా నుండే తనదైన మార్కుతో దూసుకుపోతూ, తన సొంత కష్టం మీద నేడు పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ‘గంగోత్రి’ సినిమా విడుదలైన కొత్తల్లో అల్లు అర్జున్ ని ఇతను హీరోనా అని వెక్కిరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే అలా వెక్కిరించారో, నేడు వాళ్ళే హీరో అంటే ఇలా ఉండాలి రా అని అనిపించే రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. ప్రతీ హీరో కి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాలంటే రాజమౌళి ఉండాల్సిందే.
కానీ అల్లు అర్జున్ రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టి సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు రాజమౌళి తర్వాత ఇండియా లో బిగ్గెస్ట్ బ్రాండ్ అల్లు అర్జున్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రతీ హీరో కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు ఉండడం చాలా కామన్. అలా అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి, కానీ ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ ని బాగా అలరిస్తాడు అల్లు అర్జున్. కానీ ఎవరికీ నచ్చని సినిమాలు ఆయన కెరీర్ లో ఏమైనా ఉన్నాయా అంటే, అది వరుడు మరియు ‘నా పేరు సూర్య’ సినిమాలు మాత్రమే.
‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్న సమయం లోనే ఈ చిత్రం ఫ్లాప్ అవుతుంది అనే విషయం ముందుగానే అల్లు అర్జున్ కి అర్థం అయ్యిందట(Allu Arjun Flop Movies). ఎందుకంటే నేటి తరం లో ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలు, కామెడీ , హారర్ మరియు కమర్షియల్ సినిమాలను చూస్తున్నారు, ఇలాంటి చిత్రాలను ఎందుకు చూస్తారు అని అడిగేవాడట డైరెక్టర్ ని. కాకపోతే కెరీర్ లో ఒక్క దేశభక్తి సినిమా అయినా ఉండాలి అనే ఉద్దేశ్యం తోనే ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసాడట అల్లు అర్జున్. అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. అల్లు అర్జున్ మల్లి త్రివిక్రంతో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు అని సినీ వర్గాల్లో గుసగుసలు. త్రివిక్రమ్ ఈ సరి అల్లు అర్జున్తో ఏదో పెద్ద ఎక్స్పరిమెంట్ చేయబోతున్నాడు అంట. దీని అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పేసాడు, అతి త్వరలోనే ఆఫిసిఅల్ ప్రకటన కూడా రాబోతుంది, వేచి చుడండి.