Allu Arjun Into Politics: ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఇతర రాష్ట్రాల్లో రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ గా నిల్చిన హీరో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్. మెగాస్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అదిగపెట్టిన అల్లు అర్జున్ తొలిసినిమా నుండే తన టాలెంట్ ని చూపిస్తూ ఇండస్ట్రీ లో అంచలంచలుగా ఎదిగి నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా నటించాడు. ‘పుష్ప ‘ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అంచనాలు ఇప్పటికే ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా మేనియా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీ కి ప్రచారం చేయబోతున్నాడా ? తన మామయ్య కోసం ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మామయ్య కోసం పోరాటం అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే.
తనకి పిల్లని ఇచ్చిన మామయ్య, అనగా స్నేహా రెడ్డి తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి కోసం ప్రచారం చేయబోతున్నాడని టాక్. చందా శేఖర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లో యాక్టీవ్ గా కొనసాగుతున్నాడు. రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడని టాక్. ఈ నెల 19 వ తారీఖు నుండే ఆయన జనాల్లో యాక్టీవ్ గా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్దపూరు మండలం లో రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ఆఫీస్ ని ప్రారంభించడానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచేస్తున్నాడు(Allu Arjun Into Politics).
అక్కడే సమీపం లో ఆయన 10 వేల మంది జనాలను సమకూర్చి ఒక సభ ని ఏర్పాటు చేయబోతున్నాడట. ఈ సభలో అల్లు అర్జున్ జనాలను ఉద్దేశించి ఒక ప్రసంగం ఇవ్వబోతున్నాడని, ఇది రాజకీయ ప్రసంగం అని టాక్ ఉంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. భారత దేశం మొత్తం ప్రస్తుతం ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా లో హీరోగా నటించిన అల్లు అర్జున్ సౌత్ హీరో నుండి డైరెక్ట్ పాన్ ఇండియా స్టార్ హీరో లిస్ట్ లోకి వచేసాడు. అల్లు అర్జున్ ఫాన్స్ ఎన్నో ఆశతో ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.