Sunday, May 19, 2024
HomeCinemaAnand Devarakonda : మల్లి బకరా అవ్వనున్న విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ..

Anand Devarakonda : మల్లి బకరా అవ్వనున్న విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ..

Anand Devarakonda : యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మంచి పాపులారిటీ ని దక్కించుకున్న వైష్ణవి చైతన్య అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అలా కెరీర్ ని నెట్టుకొస్తున్న వైష్ణవి చైతన్య రీసెంట్ గా ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆ చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

vaishnavi-chaitanya

రీసెంట్ గానే ఆమె ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. రాబొయ్యే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇంతకీ ఈ అమ్మడు దర్శకులకు ఎలాంటి కండీషన్స్ పెడుతుందో మనం ఇపుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు స్టోరీ వినే ముందు దర్శకులకు క్లారిటీ గా తన రెమ్యూనరేషన్ గురించి మరియు కథలో చేంజెస్ చేయడానికి ఓకే నా అని అడుగుతుంది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

anand-devarakonda-vaishnavi

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) మరో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించాడు. ఆ సినిమా హీరోయిన్ ఎవరు అంటుకుంటున్నారు ? బేబీ సినిమాతో తన దిశను మార్చేసిన వైష్ణవిని మల్లి తాను చేయబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టాలి అని ఫిక్స్ చేసాడు అట ఆనంద్ దేవరకొండ. మాములుగా ఒక సినిమా చేసిన తరువాత మరి కొన్ని సినిమాలు రవళి అంటే కష్టమే, కానీ ఈ అమ్ముడు మొదటి సినిమానే హిట్ కొట్టి మల్లి ఇప్పుడు అదే హీరోతో ఇంకో ఛాన్స్ కొట్టేసింది అంటే గ్రేట్.

anand-devarakonda

ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు ఆ డైరెక్టర్ పేరు రవి నంబూరి. బేబీ సినిమా డైరెక్టర్ రాజేష్ ఈ సినిమాకు స్టోరీ రాసి మరి ప్రొడ్యూసర్ గా చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు సినిమా బృందం. ఈ ఫస్ట్ లుక్ లో ఆనంద్ దేవరకొండ వైష్ణవి బుగ్గలు పట్టుకొని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఐతే ఫాన్స్ మాత్రం ఆనంద దేవరకొండను తెగ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం బేబీ సినిమా.

బేబీ సినిమాలో ఆనంద్ ని వాడుకొని వదిలేసి ఎలా ఐతే ఒక బకరాని చేసిందో ఇందులో కూడానువ్వు బకరావే అవుతావు ఆనందు అంటూ ఫాన్స్ ఫన్నీ గా హీరో ని ట్రోల్ చేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts