Home Cinema Anasuya : జనసేన పార్టీ నుండి బరిలో దిగనున్న అనసూయ..? స్వయంగా తెలియచేసిన నటి..

Anasuya : జనసేన పార్టీ నుండి బరిలో దిగనున్న అనసూయ..? స్వయంగా తెలియచేసిన నటి..

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఈ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు వెండితెరపై కూడా రచ్చ లేపుతుంది ఈ అమ్ముడు. రామ్ చరణ్ రంగస్థలం లో తన పాత్రకు మంచి పేరు దక్కించుకుంది. రంగమత్తగా ప్రేక్షకులని బాగా అలరించింది. ఇక పుష్ప సినిమాలో తన పాత్రతో మరింత పేరుని సంపాదించుకుంది అనసూయ. పెళ్ళయ్యి ఇద్దరి పిల్లల తల్లి ఐన అనసూయ అస్సలు అలా కనిపించదు.

కుర్రాళ్ళో తన క్రేజ్ వేరే లెవెల్, కుర్రాళ్ళు మాత్రమే కాదు పడుచువారు కూడా అనసూయను బాగా లైక్ చేస్తారు. ఇటీవల మెయిన్ పాత్రలో తాను విమానం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో అనసూయ చాల బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు కానీ తను చేసిన వేశ్య పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం అనసూయ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

anchor-anasuya

మొన్నటి దాకా అనసూయ జగన్ పార్టీ ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్టు బాగా ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా అనసూయ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను జనసేన పార్టీ నుంచి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియచేసింది. దీనితో అందరూ ఒక్క సారిగా అవాక్కయ్యారు. అదేంటి మొన్నటి వరకు ఆ పార్టీ అని ఇప్పుడు ఏంటి జనసేన కు సపోర్ట్ చేస్తుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version