Home Cinema Anchor Jhansi: ఆ హీరో తో రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ఝాన్సీ

Anchor Jhansi: ఆ హీరో తో రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ఝాన్సీ

Anchor Jhansi: తెలుగు బుల్లితెర పై యాంకరింగ్ రంగం లో దూసుకొచ్చిన ఇద్దరు ముగ్గురు టాప్ యాంకర్స్ లో ఒకరు ఝాన్సీ. ఒకప్పుడు యాంకర్ సుమకి ఈమెకి పోటాపోటీ వాతావరణం ఉండేది. సుమ డేట్స్ దొరక్కపోతే ఝాన్సీ డేట్స్ కోసం , అలాగే ఝాన్సీ డేట్స్ దొరకకపోతే సుమ డేట్స్ కోసం పోటీ పడుతూ ఉండేవాళ్ళు మన మీడియా చానెల్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఆడియో ఫంక్షన్స్ కి వీళ్లిద్దరి హవానే ఎక్కువగా ఉండేది(Jhansi Caught in raid). అయితే ఝాన్సీ కి జోగినాయుడు అనే కమెడియన్ తో పెళ్ళైన తర్వాత యాంకరింగ్ రంగం కి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ సినిమాలని మాత్రం ఈమె వదలలేదు.

jhansi-caught-in-raid

క్యారక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణిస్తూనే ఉంది. యాంకర్ సుమ కూడా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ లో నటించింది కానీ, ఝాన్సీ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటికీ కూడా ఝాన్సీ సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తునే ఉంది. ఇది ఇలా ఉండగా గతం లో ఝాన్సీ పైనా చాలా రూమర్స్ వచ్చేవి(Jhansi Caught in raid). అవేమిటి అంటే ఆమె గతం లో ఒక స్టార్ హీరో తో రైడింగ్ లో దొరికిపోయిందని, పోలీసులు ఆమెని పట్టుకున్నారని ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యేవి. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ వార్తలపై స్పందించింది.

ఆమె మాట్లాడుతూ ‘అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, ఇండస్ట్రీ లో నేనంటే పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుడు ప్రచారం అది,వాళ్లెవరో కూడా నాకు తెలుసు.నేను నిజంగా అలాంటి పనులే చేసి ఉంటే ఈరోజు నేను ఇండస్ట్రీ లో ఉండేదానిని కాదు , ఇన్ని అవకాశాలు అసలు వచ్చేవే కాదు,ఎప్పుడో నన్ను పంపేసేవారు’ అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్జుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక ఝాన్సీ ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘దసరా’,’అన్ని మంచి శకునములే’ వంటి చిత్రాలలో నటించింది.

వీటిల్లో రెండు సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 22 వ తారీఖున అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాలో ఝాన్సీ ముఖ్య పాత్ర పోషించడం అనేది సాధారమైన విషయం కాదు, ఈ సినిమా ఆమెకి ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.

Exit mobile version