Monday, May 20, 2024
HomeCinemaAnchor Suma : అల్ట్రా మోడ్రన్ లుక్ లో యాంకర్ సుమ.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Anchor Suma : అల్ట్రా మోడ్రన్ లుక్ లో యాంకర్ సుమ.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Anchor Suma : బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ సుమంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్లలో ఆమె మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా అదురు బెదురు లేకుండా తన చలాకీ మాటలతో రంజింప చేస్తుంటారు. సుమ నిజానికి మలయాళీ అయినా తెలుగు చక్కాగా మాట్లాడగలదు. రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటికి కోడలు అయ్యింది. దాదాపు చలాకైన మాటలతో గత 16 సంవత్సరాలుగా టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక సుమ మొదటగా కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తన మాతృభాష అయిన మలయాళంలో కూడా కొని సినిమాలు చేసింది.

suma-anchor

కానీ సరైన గుర్తింపు రాలేదు. దీంతో కొన్ని తెలుగు సీరియల్స్ లో అవకాశం రావడంతో అక్కడ నటించి.. యాంకరింగ్ వైపు అడుగులు వేసి స్టార్ యాంకర్ అయింది. ఇటీవల జయమ్మ పంచాయితీ అంటూ ఓ సినిమా తీశారు. ఈ సినిమా కోసం సుమ చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేశారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ తమ అందాలను ఎప్పటికప్పుడు అభిమానులకు కనువిందు చేస్తున్నారు.ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ లేకపోవడంతో హీరోయిన్స్ అందాలను అభిమానులు చూసే వీలు లేకపోయేది.

anchor-suma-kanakala

వెండి తెరపై తప్పిస్తే ఎక్కడా కూడా ఆ వారి అందాలను మరోసారి చూసే ఛాన్స్ ఉండేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువగా ఉంది. వారి బాటలోనే సుమ తాజాగా అల్ట్రా మోడల్ స్టైలీష్ లుక్‌లో అదరగొట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ షర్ట్ గ్రే కలర్ స్కట్ లో ఇప్పటివరకు చూడని లుక్స్లో కనిపించి అలరించింది. దీంతో సుమ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. లుక్ చూసిన నెటిజన్లు ‘నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా.. ఇప్పుడు ఈ మోడరన్ లుక్స్ అవసరమా..? అని ఫైర్ అవుతున్నారు.

anchor-suma

మరికొందరైతే సుమ ట్రెండ్ ని ఫాలో అవుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరి కొంతమందైతే ఫ్యాషన్ అనే దోమ నీకు కుట్టిందా.. ఇక నీ కెరియర్ నాశనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు సుమ ఓ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తను యూట్యూబ్ ఛానల్‌తో తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నట్లు సుమ తెలిపారు. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో భాదలు పడినట్లు చెప్పారు. ఇప్పుడు మల్లి కొద్దిగా బాగోడంతో తిరిగి షో లు చేస్తుంది అని చెప్పింది సుమ.

ఏదిఏమైనా కూడా యాంకర్ సుమ ని మెచ్చుకోవాల్సిందే. గత 15-20 ఏళ్ళ నుండి బుల్లి తెరను ఏలుతుంది సుమ. ఎంతో మంది వచ్చారు పోయారు కానీ సుమ స్థానాన్ని మాత్రం ఎవ్వరు కబ్జా చేయలేకపోయారు. దీనికి కారణం తన మాట తీరు తాను సమయం బట్టి వ్ ఎస్ జోకులు నే చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts