Friday, September 20, 2024
HomeCinemaAnupama: రోజు రోజుకు శృతి మించుతున్న అనుపమ.. ఈ సారి డైరెక్ట్ అది తీసేసి..

Anupama: రోజు రోజుకు శృతి మించుతున్న అనుపమ.. ఈ సారి డైరెక్ట్ అది తీసేసి..

Anupama Overaction: టాలీవుడ్ లో పెద్దగా సూపర్ హిట్ రేషియో లేకపోయినా కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అనుపమ పరమేశ్వరన్ పేరు కచ్చితంగా ఉంటుంది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమా లో ఒక హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్,ఆ తర్వాత తెలుగు లో త్రివిక్రమ్ – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమెది నెగటివ్ రోల్ అయ్యినప్పటికీ కూడా, ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో మాత్రం విఫలం అవ్వలేదు.

anupama-overaction

ఆ తర్వాత తెలుగు లో ఈమె హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ‘శతమానం భవతి’ మరియు ‘కార్తికేయ2’ చిత్రాలు మాత్రమే భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు తప్ప ఆమె కెరీర్ లో పెద్దగా సక్సెస్ రేషియో లేదు. అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి ‘టిల్లు స్క్వేర్’. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

anupama

వీళ్లిద్దరికీ సంబంధించిన ఫస్ట్ లుక్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది(Anupama Overaction). కార్ లో హీరో తో రొమాన్స్ చేస్తున్నట్టుగా అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఫోజు యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అలాగే మొదటి పాటకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇకపోతే ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ కి మరియు హీరో సిద్దు జొన్నలగడ్డ కి మధ్య రొమాన్స్ వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. కేవలం రొమాన్స్ మాత్రమే కాదు హాట్ ఇంటిమేట్ సన్నివేశాలు కూడా సినిమా మొత్తం ఉంటాయట.

anupama-parameswaran

యూత్ ఆడియన్స్ పండుగ చేసుకునే రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అనుపమ పరమేశ్వరన్ ని ఈ రేంజ్ బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఇప్పటి వరకు చూసి ఉండమని, భవిష్యత్తులో కూడా చెయ్యలేదేమో అని అంటున్నారు,ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి. ప్రస్తుతం అనుపమ చేతిలో 2 తెలుగు సినెమలి, 1 తమిళ్ సినిమా ఉంది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వనున్నాయి. కార్తికేయ 2 తరువాత అనుపమావి ఏ సినిమాలు రిలీజ్ అవ్వలేదు, దీనితో ఫాన్స్ తన తరువాయి సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనే చెప్పుకోవాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts