Sunday, April 28, 2024
HomeCinemaSiddu Jonnalagadda : డీజే టిల్లు ఫేమ్ సిద్దు ఇంత పెద్ద తప్పు చేశాడా.. ఇక...

Siddu Jonnalagadda : డీజే టిల్లు ఫేమ్ సిద్దు ఇంత పెద్ద తప్పు చేశాడా.. ఇక కెరీర్ క్లోజ్..

Siddu Jonnalagadda : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్రర్ ట్రెండ్ నడుస్తుంది మరియు అందరు హీరోలు మరో స్టార్ హీరోతో సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు. అప్పట్లో ఇలా ఎవరు చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలం లో యూత్ హీరోస్ (Siddu Jonnalagadda Mistake) అందరు మల్టీ స్టార్రర్ సినిమాలు చేసి సినిమా అభిమానులకు మరింత ఆహ్లాదకరమైన వినోదాన్ని అందిస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే ఎంత మంది స్టార్ హీరోలు కలిసైనా ఒకే సినిమాకు పనిచేస్తున్నారు.

siddu-jonnalagadda-comitted-big-mistake-by-rejecting-a-role-in-chiranjeevi-upcoming-remake-of-bro-daddy

ఇటీవల ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి మరియు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మరో మల్టీస్టార్రర్ మన ముందుకు రాబోతుంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మల్టీ స్టార్రర్ సినిమాలో ఎవరెవరు కలిసి పని చేస్తున్నారంటే, అది మన మెగాస్టార్ చిరంజీవి మరియు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ పేర్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన పొలిటికల్ కెరీర్ అయిపోయాక మల్లి సినిమాలకు తిరిగివచ్చి వరుస సినిమాలు సైన్ చేస్తున్న విషయం తెలిసిందే.

chiranjeevi-siddu-jonnalagadda

ఈయన రాబోయే ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి అని చెప్పుకోవాలి. అవేంటో ఇప్పుడు చూదాం. చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళ్ సూపర్ స్టార్ అజిత్ వెదళం సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇకపోతే చిరంజీవి బిమ్బిసార డైరెక్టర్ వశిష్ఠతో ఇంకో సినిమా సైన్ చేసారు. ఈ సినిమా పూర్తి అయ్యాక చిరు బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

chiranjeevi-siddu-jonnalagadda

కళ్యాణ్ కృష్ణ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సినిమా మలయాళం లోని బ్రో డాడీ సినిమాకు రీమేక్ అంట. అయితే ఈ సినిమాలో చిరుతో పాటు డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda Mistake) ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా మళయాళం లో బారి విజయం సాధించింది మరియు ఈ సక్సెస్ ఫుల్ సినిమాను తెలుగు లో కూడా మంచి హిట్ కొడుతుందని ఈ చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అదేంటంటే, మొన్నటి దాకా చిరు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా సిద్దు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను చేయనని పక్కకు తప్పుకున్నారట. బ్రో డాడీ సినిమాలో చిరంజీవి పక్కన నేను చేస్తే నా కెరీర్ ఎక్కడికో పోతుంది కానీ ఈ సినిమాలో నా పాత్ర చాలా చిన్నగా ఉంది కాబ్బటి నేను చేయను అని సిద్దు జొన్నలగడ్డ డైరెక్టర్ కు చెప్పాడట. ఇపుడిపుడే సినిమాలు చేస్తున్న మరియు హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్న సిద్దు ఈ సినిమాలో గెస్ట్ పాత్ర చేయలేనని అన్నారట. దీనితో మెగా అభిమానులు సిద్దుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts