Sunday, May 19, 2024
HomeCinemaVaishnavi Chaitanya: బోనాలు వేడుకల్లో పాల్గొన్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vaishnavi Chaitanya: బోనాలు వేడుకల్లో పాల్గొన్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vaishnavi Chaitanya: తెలంగాణ ప్రాంతం లో ఇప్పుడు ఎక్కడ చూసిన బోనాల పండుగ వాతావరణం కనపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఉత్సవం రోజు బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటారు భక్తులు. హైదరాబాద్ అమ్మ వారి ఆలయాలు మొత్తం భక్తుల కోలాహలం తో కిటకిటలాడిపోతున్నాయి (Vaishnavi Chaitanya At Bonalu). ఈ సందర్భంగా కొంత మంది రాజకీయ నాయకులూ, సినీ సెలెబ్రిటీలు కూడా బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. రీసెంట్ గా బేబీ మూవీ సక్సెస్ తో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్న ప్రముఖ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటుంది.

vaishnavi-chaitanya-at-bonalu

హైదరాబాద్ లోని పాతబస్తీ వద్ద ఉన్న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసింది వైష్ణవి చైతన్య. బంగారు బోనం ని అమ్మవారికి సమర్పించిన వైష్ణవి చైతన్య కి సంబంధించిన ఫోటోలు/వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది (Vaishnavi Chaitanya At Bonalu). ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వైష్ణవి మాట్లాడుతూ ‘ నేను నా చిన్నప్పటి నుండి ఈ పాత బస్తీ లోని పుట్టి పెరిగాను, ప్రతీ ఏడాది మా అమ్మానాన్నలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకునేదానిని.

vaishnavi-chitanya-baby-movie-actress

ఇప్పుడు బేబీ సినిమా సక్సెస్ తర్వాత బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నందుకు ఎంతో సంతోషం గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. బేబీ చిత్రానికి ముందు వైష్ణవి చైతన్య ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. బేబీ చిత్రం విడుదలకు ముందు వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ లోని ఉజ్జయిని అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులు లాగానే గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చొని దర్శనం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె వీఐపీ క్యాటగిరిలో అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పించుకుంది. ఇంత తక్కువ గ్యాప్ లో ఆమె జాతకం ఎలా తిరిగిందో మీరే చూడండి.

vaishnavi-chaitanya

ఇక పోతే బేబీ చిత్రం రోజు రోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే 11 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం 20 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వైష్ణవి కెరీర్ ఎలా మారబోతుందో చూడాలి. బేబీ సినిమా 3 డేస్ కలెక్షన్ మాత్రం కొత్ రికార్డులు సృష్టిస్తుంది అనే చెప్పాలి. 3వ రోజు 23.5 కోట్లు వసూళ్లు చేసినా బేబీ మూవీ. ఇది ఒక చిన్న సినిమాకి పెద్ద మొత్తం అనే చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts