Home Cinema Shikhar Dhawan : మిథాలీ రాజ్ తో పెళ్లిపై స్పందించిన శిఖర్ ధావన్.. క్లారిటీ ఇచ్చేసాడు..

Shikhar Dhawan : మిథాలీ రాజ్ తో పెళ్లిపై స్పందించిన శిఖర్ ధావన్.. క్లారిటీ ఇచ్చేసాడు..

Shikhar Dhawan : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో భారత జట్టులో టాప్ లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మెన్ గా రాణించాడు. తొలి మ్యాచ్‌లో అతను బారి స్కోర్ ను చేసి, అతను జట్టు విజయాల పరంపరను కొనసాగించాడు. అయితే అలాంటి శిఖర్ ధావన్ ఇప్పుడు భారత జట్టులో లేడు. శుభమాన్ గిల్ లాంటి యువ స్టార్లు భారత జట్టులోకి రావడంతో భారత జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కలేదు.

అప్పటి నుంచి శిఖర్ ధావన్ ఐపీఎల్ లీగ్‌లలో మాత్రమే ఆడాడు. అతను అప్పుడప్పుడు రంజీ ట్రోఫీలో కూడా కనిపిస్తాడు. శిఖర్ ధావన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిఖర్ ధావన్ తన మొదటి భార్య ఐషా ముఖర్జీకి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. భారత క్రికెట్ జట్టు సభ్యురాలు మిథాలీ రాజ్‌ని శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

shikhar-dhawan-responded-on-marriage-rumor-with-mithali-raj

అయితే ఈ వార్తలపై ఇద్దరు ఇంకా స్పందించలేదు. అయితే తాజాగా ఈ వార్తలపై శిఖర్ ధావన్ మరోసారి స్పందించాడు. మితాలీ రాజ్‌ని ధావన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదని ధావన్ అన్నాడు. ఈ పుకార్లు చాలా విచిత్రంగా ఉన్నాయని శిఖర్ ధావన్ సింపుల్ గా చెప్పాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. IPL 2024లో గాయం కారణంగా, ధావన్ ఫస్ట్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాడు.

Exit mobile version