Home Cinema ఊహించని మలుపు తీసుకున్న కన్నప్ప సినిమా.. సీన్లోకి బాలీవుడ్ స్టార్..

ఊహించని మలుపు తీసుకున్న కన్నప్ప సినిమా.. సీన్లోకి బాలీవుడ్ స్టార్..

మంచు కుటుంబం నుండి మోహన్ బాబు తరువాత నటులుగా తన ఇద్దరు కుమారులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ పరిచమయ్యారు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో హీరోలుగా నటించారు. కానీ వీరికి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటూ ఏది లేదు. మంచు విష్ణు డీ సినిమాతో కొంత మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వీరు చేసే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎంత ట్రై చేసిన కానీ ఈ ఇద్దరు హీరోలు మంచు అభిమానులకు ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వలేకపోతున్నారు.

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ అయినా కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తన తండ్రి మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా, డైరెక్టర్ గా మహాభారతం సీరియల్ దర్శకుడు ముకేశ్ కుమార్ పని చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు అని మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఓ క్యామియో చేస్తున్నారు అంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది.

bollywood-star-akshay-kumar-joins-kannappa-shooting-in-hyderabad

ఆ స్టార్ హీరో ఎవరు అనేది మనం ఇపుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కన్నప్ప సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు అంట. అందుకోసమే అక్షయ్ కుమార్ హైదరాబాద్ కు వచ్చారు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ వార్తా వైరల్ అవుతుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కొద్ది రోజులో వస్తుంది అని మనకు తెలుస్తుంది. ఏదిఏమైనా కన్నప్ప సినిమాలో ముల్టీపుల్ స్టార్ నటులు నటించడంతో ఈ సినిమా మలుపు తిరిగింది అంటూ మంచు అభిమానులు అంటున్నారు.

Exit mobile version