Home Cinema ప్రభాస్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వేణు స్వామి సతీమణి.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రభాస్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వేణు స్వామి సతీమణి.. వైరల్ అవుతున్న వీడియో..

జ్యోతిష రంగంలో దిట్ట అయినా వేణు స్వామి గురించి అందరికి తెలిసందే. టాప్ సెలబ్రిటీస్ పై వ్యాక్యలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఈయన. దీని వలన ఎన్నో వివాదాలలో ఇరుకున్నారు వేణు స్వామి. అయితే వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి కూడా మన తెలుగువారికి పరిచయమే. వీణ వాయించడం చాలా బాగా వస్తుంది మరియు ఆమె తరచూ తన పెరఫామెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంది.

ఈమెకు ఇంస్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. శ్రీవాణి గారు అటు భక్తి పాటలు, ఇటు సినిమా పాటలు అన్ని వీణతో వాయిస్తూ వీడియోలు పెడుతుంటది. ఇదిలా ఉంటె, ఎప్పుడు వేణు స్వామి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. కానీ ఈసారి ఆయన భార్యా వీణ శ్రీవాణి వార్తలలోకి ఎక్కింది. దానికి కారణం ఏంటంటే, శ్రీవాణి గారికి తన ఇంట్లో పెరిగే ఫలాలు, కూరగాయలు అందరికి పంచి పెట్టడం అలవాటు. అయితే, అందరికి ఎప్పుడు పంట వచ్చిన సరే పంచుతుంటాది.

venu-swamy-wife-srivani-special-gift-to-prabhas

ఈసారి ఆమె తోటలో అరుదైన సీతాఫల్ పందులు వచ్చాయట. వాటిని శ్రీవాణి పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ కు పంపిస్తున్న అంటూ ఓ వీడియో చేసి ఆమె సోషల్ మీడియా కాతలో పోస్ట్ చేసింది. అది చూసిన ప్రభాస్ అభిమానులు ఈమెను ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు మీ భర్త వేణు స్వామి ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే, మీరు అది కప్పిపుచ్చడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ కామెంట్లు విసురుతున్నారు ప్రభాస్ అభిమానులు.

Exit mobile version