Sunday, May 19, 2024
HomeCinemaChiranjeevi : చూసుకోరు వెధవలు.. మధ్య తరగతి వారిపై చిరంజీవి కామెంట్స్ హల్ చల్..

Chiranjeevi : చూసుకోరు వెధవలు.. మధ్య తరగతి వారిపై చిరంజీవి కామెంట్స్ హల్ చల్..

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ కె బాస్ అని అభిమానులు ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఈ ఏజ్ లో కూడా అదిరిపోయే స్టెప్పులతో ఆ ఎనర్జీ తో అభిమానులని అలరిస్తున్నాడు చిరు. ప్రస్తుతం డైరెక్టర్ వసిష్ఠ తో కలిసి ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు చిరు, ఈ సినిమాలో నటి త్రిష హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా 2025 సంక్రాంతి సమయానికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సినిమా టీం.

ఇక రీసెంట్ గా తెలుగు మీడియా ఫెడరేషన్ వేడుకలు జరిగాయి, దానికి విజయ్ దేవరకొండ, చిరంజీవి ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ వేడుకలకు యూట్యూబ్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కూడా చాలా మందే విచ్చేసారు. ఇదే ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసాడు. నేను చాల మధ్య తరగతి నుంచి వచ్చాను, మా ఇంట్లో షాంపూ ఐపోతే అందులో వాటర్ పోసి షేక్ చేసి వాడుతాము.. మీరు అలా ఎపుడైనా చేశారా.? అని అడిగాడు.

vijay-devarakonda-chiranjeevi

దానికి స్పందిస్తూ చిరంజీవి, నేను మా ఇంట్లో ఐపోయిన సబ్బులు అన్ని కలిపి ఒక్కదానిలా చేసి వాడుత, ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇది చాలా అవసరం అని చాపుతూనే మరో ఉదాహరణ చప్తు మొన్న చరణ్ బ్యాంకాక్ వెళ్ళాడు. అప్పుడు నేను న ఫోన్ నుండి కెమెరా ఓపెన్ చేసి ఫ్లోర్ లో అన్ని లైట్ ఆఫ్ చేసారో లేదో అని చూసాను. 5 లైట్లు ఆన్ చేసి ఉన్నాయి, ఎవరికోసం అసలు ఆ లైట్లు, చేసుకోరు వెధవలు అని వెళ్లి ఆఫ్ చేసి ఫోన్ లో ఫ్లాష్ వేసుకొని వచ్చేసాను అని చెప్పారు చిరు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts