Colors Swathi: ఒకప్పుడు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కలర్స్ అనే ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపుని దక్కించుకున్న కలర్స్ స్వాతి, ఆ తర్వాత ‘సుబ్రమణ్యపురం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టాక, మొదటి చిత్రం ‘డేంజర్’ పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈమె చేసిన ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై స్కూల్’, ‘స్వామి రారా’,’కార్తికేయ’ మరియు ‘కందిరీగ’ వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కెరీర్ లో ఇన్ని సక్సెస్ లు ఉన్నా కూడా ఈమె టోల్హైవూడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది.
కెరీర్ పీక్ స్థానం లో ఉన్నప్పుడే ఈమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది, మళ్ళీ చాలా కాలం తర్వాత ‘పంచతంత్రం’ అనే చిత్రం ద్వారా రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కలర్స్ స్వాతి ఆశించిన స్థాయికి ఎదగలేక పోవడానికి కారణం ఆమె తల్లే అని అందరూ అంటుంటారు. కలర్స్ స్వాతి షూటింగ్ కి వెళ్లే ప్రతీ రోజు ఆమెతో పాటుగా ఆమె అమ్మ కూడా తోడుగా వస్తుందట. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి విన్న తర్వాత ఆమెలో చాలా భయం ఉండేదట. దర్శక నిర్మాతలు కలర్స్ స్వాతి అలాంటి విషయాలు మాట్లాడడానికి కూడా భయపడేవారట ఆమె అమ్మని చూసి.
అంతే కాదు సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా కలర్స్ స్వాతి(Colors Swathi) వాళ్ళ అమ్మ ఒప్పుకునేది కాదట. ప్రతీ సినిమా సైన్ చేసేటప్పుడు ఆమె ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే కలర్ స్వాతి ఒప్పంద పత్రాలపై సంతకం చేసేడట. అలా ఆమె ఆ రేంజ్ ఒత్తిడి చెయ్యడం వల్లే దర్శక నిర్మాతలు భరించలేక స్వాతి తో సినిమాలు చెయ్యడం తగ్గించేసారట. అందుకే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన కలర్స్ స్వాతి ఇంట్లో పెట్టిన కఠినమైన ఆంక్షల వల్ల మీడియం రేంజ్ హీరోయిన్ గానే సినిమా ఇండస్ట్రీ నుండి వైదొలగింది అని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ఈమె ‘మంత్ ఆఫ్ మధు’, ‘ఇడియట్స్’ వంటి చిత్రాలలో నటిస్తుంది. ఈ రెండు కూడా తెలుగు సినిమాలే, ఈ చిత్రాల తర్వాత ఆమె తమిళం,హిందీ లో కూడా సినిమాలు చేయబోతోందని టాక్. స్వాతి రెడ్డి చివరిగా కనిపించిన సినిమా పంచతంత్రం. స్వాతి రెడ్డి మల్లి తెలుగు సినిమాలు చేసి స్వామి రా రా వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో అందించాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు. చూదాం స్వాతి ఏమైనా మనసు మార్చుకుని మల్లి ఇండస్ట్రీ కి వస్తుందేమో. మీరు ఎం అనుకుంటున్నారు.?