Sunday, May 19, 2024
HomeCinemaColors Swathi: ఆ హీరోతో నటిస్తే చంపేస్తాం అంటూ కలర్స్ స్వాతి కి బెదిరింపులు..

Colors Swathi: ఆ హీరోతో నటిస్తే చంపేస్తాం అంటూ కలర్స్ స్వాతి కి బెదిరింపులు..

Colors Swathi: బుల్లితెర మీద ‘కలర్స్’ అనే ప్రోగ్రాం తో యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన స్వాతి కి ఆ ప్రోగ్రాం పేరే స్క్రీన్ నేమ్ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈమెని కలర్స్ స్వాతి అని పిలిస్తేనే జనాలు గుర్తు పడుతారు. స్వాతి అంటే మాత్రం ఎవ్వరూ గుర్తు పట్టరు(Colors Swathi Nikhil). ఆ రేంజ్ లో ఆ ప్రోగ్రాం ఆమె మీద ముద్ర వేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు తమిళం లో తెరకెక్కిన ‘సుబ్రమణ్యపురం’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన కలర్స్ స్వాతిఆ తర్వాత కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘డేంజర్’ సినిమాతో తెలుగు లో నటించింది.

colors-swathi-nikhil

ఈ రెండు సినిమాలు ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు ని తెచ్చిపెట్టలేకపోయాయి కానీ, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అష్ట చమ్మా’ మాత్రం ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘స్వామి రారా, ‘కార్తికేయ’ వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి కలర్స్ స్వాతి కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. అలా కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయం లో వికాస్ వాసు అనే అతనిని ప్రేమించి పెళ్ళాడి సినిమాలకు దూరం అయ్యింది. అయితే రీసెంట్ గా ఈమె తన భర్త తో విడాకులు తీసుకుంది అనే వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది.

nikhil-swathi

అది కాసేపు పక్కన పెడితే ఈమెకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈమె ఎక్కువగా హీరో నిఖిల్ తో సినిమాలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే రెండు మూడు సార్లు కలిసి నటిస్తే వాళ్ళ మధ్య ఎదో ఉంది అంటూ అఫైర్స్ పెట్టే కాలం అయిన ఈరోజుల్లో నిఖిల్ కి స్వాతి కి మధ్య కూడా ప్రేమాయణం నడిచినట్టుగా అప్పట్లో ఒక పుకారు తెగ షికారు చేసింది. దీనితో స్వాతి ఇంట్లో వాళ్ళు ఇంకోసారి ఆ అబ్బాయి తో కలిసి సినిమా చేస్తే చంపేస్తాం అని బెదిరించారట.

swathi-nikhil

దీనితో స్వాతి అప్పుడే నిఖిల్ తో ‘శంకరాభరణం’ అనే చిత్రం లో నటించడానికి ఒప్పుకుంది. ఇంట్లో వాళ్ళు అలా బెదిరించేసరికి ఆమె ఆ సినిమాకోసం తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసింది అట(Colors Swathi Nikhil). ప్రస్తుతం స్వాతి మలేషియా లో ఉంటుంది, పెళ్లి చేసుకుని సినిమాలు వదిలేసి భర్తతో అక్కడే ఉంటుంది. ఇలాంటి మంచి నాటి మళ్ళీ తిరి వచ్చి సినిమాలు చేయాలి అని అభిమాను చాలా గెట్టిగా కోరుకుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts