Saturday, November 23, 2024
HomeCinemaSridevi Affairs: అప్పట్లో శ్రీదేవి ఇంతమంది హీరోలతో అఫైర్స్ నడిపిందా..

Sridevi Affairs: అప్పట్లో శ్రీదేవి ఇంతమంది హీరోలతో అఫైర్స్ నడిపిందా..

Sridevi Affairs: స్వర్గం నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా అనిపించే అతి తక్కువ మందిలో ఒకరు శ్రీదేవి. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లో దేవకన్య గా ఈమె కనిపిస్తే అసలు స్వర్గం నుండి నిజంగా ఆ దేవకన్య భూమి మీదకి వచ్చి సినిమాలో నటించి వెళ్ళిపోయిందా? అనే సందేహం రాక తప్పదు. అంతటి సౌందర్యం ఈమె సొంతం. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెని మనం ఇంతలా తల్చుకుంటున్నాం అంటే, ఆమె తెలుగు ప్రేక్షకుల్లో వేసిన చెరగని ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

sridevi-kamal-hassan

బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా సక్సెస్ అయ్యి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేసేది. పెళ్లి కూడా ఆమె బాలీవుడ్ బడా నిర్మాత బోణికపూర్ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.

sridevi-affairs

ఇది ఇలా ఉండగా శ్రీదేవి బోణి కపూర్ తో పెళ్లి కాకముందు చాలా మంది హీరోస్ తో ప్రేమాయణం నడిపినట్టు ఇండస్ట్రీ లో ఎప్పటికి నుండో టాక్ ఉంది(Sridevi Affairs). మిథున్ చక్రవర్తి తో శ్రీదేవి నడిపిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. అప్పటికే ఆయనకీ పెళ్లి అయ్యింది, అయినప్పటికీ కూడా ఆయనని ప్రేమించింది. కానీ ఆయన తన మొదటి భార్య విడాకులు ఇవ్వనని మొండికేయడం తో వీళ్లిద్దరి వివాహం జరగలేదు. ఇక ఆ తర్వాత అరవింద్ గో స్వామి, రాజ శేఖర్, జెడీ చక్రవర్తి వంటి హీరోలతో కూడా ఆమె ప్రేమాయణం నడిపినట్టు టాక్ ఉంది.

sridevi

శ్రీదేవి తల్లి రాజేశ్వరి వీళ్లందరితో శ్రీదేవి ని పెళ్లి చేసుకోమని అప్పట్లో అడిగినట్టు స్వయంగా వాళ్ళే పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. అలా అతిలోక సుందరి లాంటి శ్రీదేవి కి జగదేక వీరుడు లాంటి మొగుడు వస్తాడని అనుకుంటే చివరికి బోణి కపూర్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెద్ద అందగాడు కాకపోయినప్పటికీ శ్రీదేవి బోణి కపూర్ ని ఎంతగానో ప్రేమించింది. బ్రతికి ఉన్నన్ని రోజులు ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ ముందుకెళ్ళింది. శ్రేదేవి కూతురు జాహ్నవి కపూర్ కి బాలీవుడ్ లో సక్సెస్ రాకపోవటంతో తాను కూడా తల్లి బాటలో టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts