Sunday, July 7, 2024
HomeCinemaRavi Teja-Nagarjuna : రవితేజ దర్శకత్వం లో నాగార్జున హీరో గా నటించిన సినిమా అదేనా..?...

Ravi Teja-Nagarjuna : రవితేజ దర్శకత్వం లో నాగార్జున హీరో గా నటించిన సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా..

Ravi Teja-Nagarjuna : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన వారిలో ఒకడు మాస్ మహారాజ రవితేజ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఎన్నో కష్టాలను, ఒడిదుడుగులను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ ప్రారంభం లో ఆయన చేసినవి అన్నీ సపోర్టింగ్ రోల్స్, మరియు కామెడీ పాత్రలే అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత హీరో గా మారి వరుసగా హిట్ మీద హిట్ కొట్టి అనతి కాలం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇప్పటికీ రవితేజ సినిమా అంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఎలా ఈగబడి వెళ్తారో మన అందరికీ తెలిసిందే.

ravi-teja

నిర్మాతలకు ఆయన ఒక కల్ప వృక్షం, ఎంత ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మినిమం గ్యారంటీ వసూళ్లు వస్తాయి. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజి ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు ఈయన. ఇక పోతే రవితేజ అప్పట్లో ఎంతో మంది టాప్ స్టార్ డైరెక్టర్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వారిలో కృష్ణ వంశీ కూడా ఉన్నాడు. ఈయన తోనే రవితేజ ఎక్కువ సంవత్సరాలు పని చేసాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన దగ్గర ఉన్నన్ని రోజులు దర్శకత్వం లో ఎన్నో ట్రిక్స్ కూడా నేర్చుకున్నాడు(Ravi Teja-Nagarjuna). అలా ఆయన దర్శకత్వం వహిస్తున్న రోజుల్లో అక్కినేని నాగార్జున తో ‘నిన్నే పెళ్లాడట’ అనే చిత్రం తీసాడు.

nagarjuna-ninne-peladatha-movie

ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇండస్ట్రీ హిట్ కి వచ్చినంత వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి. ఇందులో రవితేజ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు. అంతే కాదు, ఈ సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు. కృష్ణ వంశి షూటింగ్ స్పాట్ లో లేని సమయం లో ఎన్నో సన్నివేశాలకు రవితేజ దర్శకత్వం కూడా వహించాడట. ఈ విషయం చాలా మందికి తెలియదు, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కృష్ణ వంశి ఈ విషయాన్నీ చెప్పాడు, నాగార్జున లాంటి టాప్ స్టార్ సినిమా కి రవితేజ లాంటి టాప్ స్టార్ దర్శకత్వం వహించాడు అనే మాట వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదూ.

nagarjuna

రవి తేజ ప్రస్తుతం రెండు తెలుగు సినిమా లలో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్. ఒక సినిమా ఈ ఏడాది రిలీజ్ కు సిద్ధంగా ఉండగా మరొకటి వచ్చే ఏడాది రిలీజ్ అవ్వనుంది. అంతే కాకుండా రవి తేజ ఒక సినిమా కి నిర్మాత గా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే సుందరం మాస్టర్. ఇప్పుడు రవి తేజ నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.

ఇక నాగార్జున విషయానికి వస్తే అయన రెండు సినిమాలల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదే రిలీజ్ అవ్వనున్నాయి. అక్కినేని ఫాన్స్ కి ఇక ఈ ఏడాది సినిమాలు లేనట్టే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts