Home Cinema Rajamouli : భార్యతో కలిసి మంచి రొమాంటిక్ డాన్స్ చేస్తున్న మన జక్కన్న.. వీడియో వైరల్..

Rajamouli : భార్యతో కలిసి మంచి రొమాంటిక్ డాన్స్ చేస్తున్న మన జక్కన్న.. వీడియో వైరల్..

director-rajamouli-dance-with-wife-rama-on-stage-in-a-family-function

Rajamouli : టాలీవుడ్ లో అందరూ ప్రేమగా పిలుచుకునే పేరు జక్కన. ఈయన గురించి ప్రేత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచపట్టంలో పెట్టిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. మన తెలుగు ప్రజలకు గర్వకారణం రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ లేకుండా ఇండస్ట్రీ లో ఇన్నెలనుండి రాణిస్తున్నాడు అంటే మాటలు కాదు. ఏ డైరెక్టర్ కైనా అపుడో ఎపుడో ప్లాప్ పడుతుంది. కానీ రాజమౌళి విషయంలో నో ఛాన్స్ ఎందుకంటే అయన సినిమా చేస్తే చాలా ఖచ్చితత్వం తో చేస్తాడు, అదే అతడి స్టైల్. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి SSMB 28 సినిమా చేస్తున్నాడు రాజమౌళి.

ప్రస్తుతం రాజమౌళి మరియు అయన భార్య రమాకు సంబంధించి ఒక వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తన కుటుంబంలో ఒక ఫామిలీ ఫంక్షన్ కి వెళ్ళాడు, ఆ ఫంక్షన్ లో రాజమౌళి, రమా ఇద్దరు కలిసి స్టేజి ని వారి రొమాంటిక్ డాన్స్ తో తగలపెట్టేసారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అందమైన ప్రేమారాణి పాటకు రమా, రాజమౌళి అదిరిపోయే స్టెప్పులతో అందరిని అలరించారు. అభిమానులు ఐతే మీరు డైరెక్షన్ తో పాటు ఇప్పటినుండి పాటలు కూడా కంపోజ్ చేయండి అంటూ ప్రశంసలతో ముంచేస్తున్నారు.

Exit mobile version