Rajamouli Pulpit Rock: ఇండియన్ చలన చిత్ర పరిశ్రమకి ఒక విలువైన ఖనిజం రాజమౌళి. ఈయన ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ డైరెక్టర్. #RRR చిత్రం తో ఆయన హాలీవుడ్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టి ఆస్కార్ అవార్డు ని కూడా గెలిచాడు. టైటానిక్ , అవతార్ లాంటి అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కెమరూన్ కూడా రాజమౌళి ని ఆ రేంజ్ ప్రశంసించాడంటే ఇది మామూలు విషయం కాదు. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఒక సాధారణ మనిషి, నేడు ఈ స్థాయికి చేరుకుంటాడని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు ఆరోజుల్లో.
అయితే #RRR మూవీ చిత్రం తర్వాత మరో సినిమాకి షిఫ్ట్ అయ్యే ముందు రాజమౌళి తన కుటుంబం తో కలిసి పూర్తి స్థాయిలో చిల్ అవుతున్నాడు. గత ఆరు నెలల నుండి ఆయన ఈ మోడ్ లోనే ఉన్నాడు. మరి #RRR లాంటి సినిమాలు తీసినప్పుడు ఆ మాత్రం విశ్రాంతి లేకపోతే ఎలా.? ఆయన కూడా మనిషే కదా!. ఇకపోతే రీసెంట్ గా రాజమౌళి తన భార్య రమా తో కలిసి దిగిన ఫోటోలను కొన్ని సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అవి ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి. రీసెంట్ గా వీళ్లిద్దరు ప్రపంచం లోనే అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశం పల్పిట్ రాక్ హిల్(Rajamouli Pulpit Rock) కి సందర్శించారు.
అక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదిస్తూ ఈ జంట చిల్ అవుతున్నారు. మగధీర మూవీ షూటింగ్ కోసం లొకేషన్స్ ని చూస్తున్నపుడు ఈ లొకేషన్ నాకు ఎంతో నచ్చిందని, అప్పటి నుండి ఈ లొకేషన్ కి వద్దామని అనుకుంటూ ఉన్నానని, బిజీ లైఫ్ వల్ల ఇన్ని రోజులు కుదర్లేదు, ఇప్పుడు కుదిరించి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ఈ ప్రాంతం లో ఇలా కూర్చోవడం భయంకరంగాను, అలాగే చాలా థ్రిల్లింగ్ గాను ఉందంటూ రాజమౌళి సోషల్ మీడియా లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే త్వరలోనే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు పదేళ్ళ పై నుండి ఎదురు చూస్తున్నారు. రాజమౌళి rrr సినిమా తరువాత పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్ర కూడా వేసాడు జక్కన్న. బ్రేక్ పూర్తి అయిన తరువాత మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అంటున్నారు ప్రిన్స్ ఫాన్స్.