Tuesday, May 14, 2024
HomeCinemaRajamouli : మరో మల్టీస్టార్రర్ కి రాజమౌళి ప్లాన్..ఈసారి మామూలు రేంజ్ లో ఉండదు!

Rajamouli : మరో మల్టీస్టార్రర్ కి రాజమౌళి ప్లాన్..ఈసారి మామూలు రేంజ్ లో ఉండదు!

Rajamouli : #RRR వంటి భారీ పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతుందని ఇది వరకే రాజమౌళి(Rajamouli Multi Starrer) పలు ఇంటర్వ్యూస్ లో తెలియచేసాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని జానర్ ఇది. #RRR తో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి, ఈ సినిమాతో ఏకంగా హాలీవుడ్ మార్కెట్ పైనే కన్ను వేసాడు.

rajamouli-planning-multi-starrer-again-after-rrr

రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఆగష్టు 9 వ తారీఖున మహేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చెయ్యబోతున్నారు. ఆరోజే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచెయ్యబోతున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నటించబోతున్నారని ఒక న్యూస్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఒకటి బయటపడింది.

Rajamouli multistarrer

అదేమిటంటే ఈ చిత్రం లో మహేష్ బాబు తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట. అయితే ఆ హీరో పార్ట్ 1 లో మాత్రం కనిపించడు, పార్ట్ 2 లో మెయిన్ లీడ్ గా కనిపిస్తాడట. ఈ రెండు సినిమాలు(Rajamouli Multi Starrer) ఇండియన్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ని పదింతలు పెంచే విధంగా తియ్యబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ప్రారంభం కానుంది అట. ఈ వర్క్ షాప్ దాదాపుగా 3 నెలలు ఉండబోతుందని సమాచారం.

Mahesh-Babu-Rajamouli

ఇలా ఒక సినిమా కోసం రాజమౌళి కేవలం వర్క్ షాప్ కోసమే ఇన్ని రోజులు కేటాయించడం అనేది ఎప్పుడూ జరగలేదు. #RRR చిత్రం కోసం కూడా వర్క్ షాప్ నిర్వహించాడు కానీ అది కేవలం పది రోజులు మాత్రమే ఉన్నింది. కానీ మహేష్ సినిమాకి ఏకంగా మూడు నెలల సమయం కేటాయించబోతున్నాడు అంటే ఇది ఏ రేంజ్ స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉండగా, మహేష్ ఇండియా కి తిరిగి రాగానే వెంటనే షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎలా అయినా డిసెంబర్ లోపు పూర్తి చెయ్యాలని ఆదేశాలు జారీ చేసాడట మహేష్ బాబు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts