Sunday, May 19, 2024
HomeCinemaPrabhas-Vivek Agnihotri : ప్రభాస్ అసలు ఒక హీరోనా..? డైరెక్టర్ వివేక్ సంచలన వ్యాఖ్యలు..

Prabhas-Vivek Agnihotri : ప్రభాస్ అసలు ఒక హీరోనా..? డైరెక్టర్ వివేక్ సంచలన వ్యాఖ్యలు..

Vivek Agnihotri About Prabhas : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రభాస్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరూ లేరు, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి ఒక్క హిట్ కూడా దక్కలేదు, మూడు సినిమాలు చేస్తే మూడు కూడా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ కొంతమంది బడా సూపర్ స్టార్స్ హిట్ సినిమాల సూపర్ హిట్ కలెక్షన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ప్రభాస్ కి దరిదాపుల్లో కూడా లేరు. దీంతో నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సౌత్ హీరోల డామినేషన్ ని కొంతమంది దర్శక నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారు.

prabhas-vivek-agnihotri

ప్రభాస్ మీద అక్కసు తో కోట్లాది మంది అభిమానుల మనస్సు నొచ్చుకునేలా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ప్రభాస్ పై చాలా తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే, రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు, ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో వంద మిలియన్ కి వ్యూస్ ని సాధించి టాప్ 1 స్థానం లో కొనసాగుతుంది.

vivek-agnihotri

అయితే టీజర్ పై వివేక్ అగ్నిహోత్రి పరోక్ష కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య హింస ని వివిధ కోణాల్లో స్టైల్ గా చూపించడం చాలా తేలిక అయిపోయింది. దీనినే ఫ్యాషన్ మరియు స్టైల్ గా ప్రమోట్ చేస్తున్నారు దర్శకులు(Vivek Agnihotri About Prabhas). యువతకి శాంతి మార్గాన వెళ్ళేలాగా చూపించకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ అసలు యాక్టింగ్ రాని హీరో ఇండియా లోనే బిగ్గెట్ స్టార్ అని పిలుస్తున్నారు, అసలు అతను యాక్టర్ ఎలా అయ్యాడు, స్టార్ ఎలా అయ్యాడు’ అంటూ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేసాడు.

prabhas

ఎక్కడ కూడా ప్రభాస్ ని కానీ సలార్ చిత్రం గురించి కానీ ఆయన డైరెక్ట్ గా ప్రస్తావించలేదు, కానీ టీజర్ విడుదలైన రోజే ఇలాంటి కామెంట్స్ చేసాడు కాబట్టి కచ్చితంగా అది ఉద్దేశపూర్విత కామెంట్స్ గానే భావిస్తున్నారు ఫ్యాన్స్. నిన్నటి నుండి వివేక్ అగ్నిహోత్రి ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో తెగ తిడుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది చూడాలి. వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం రెండు సినిమాల పై పనిచేస్తున్నారు. ఒకటి ఢిల్లీ ఫైల్స్ మరొకటి ది వాక్సిన్ వార్. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదల అవుతాయి అంటున్నారు సినిమా బృందం.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts