Home Cinema Hema : రేవ్ పార్టీతో బయటపడ్డ హేమ నిజస్వరూపం.. ఇంటర్నెట్ లో హల్చల్..

Hema : రేవ్ పార్టీతో బయటపడ్డ హేమ నిజస్వరూపం.. ఇంటర్నెట్ లో హల్చల్..

Hema : బెంగళూరులో రేవ్ పార్టీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ చాలా సంచలనంగా మారింది. ఆ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీలు ఉండటమే కారణమని అందరికీ తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారని కన్నడ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ రేవ్ పార్టీకి హైలెట్ గా మారిన పేరు మాత్రం టాలీవుడ్ నటి హేమ. హేమ రేవ్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

హేమ కృష్ణవేణి అని పోలీసులకు చెప్పి తప్పించుకోవాలని అనుకుంది. ఇంతకీ ఈ కృష్ణవేణి ఎవరు, హేమ తన పేరు చెప్పి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించింది అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో హేమ వివరాలు వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ వందలాది తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. హీరోయిన్ స్నేహితురాలిగా, కమెడియన్‌గా ఎన్నో ముఖ్యమైన పాత్రలు పోషించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

here-is-the-back-stroy-hema-real-name

అయితే నిజానికి హేమ అసలు పేరు కృష్ణవేణి సయ్యద్. ఆమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు. ఆమె వయస్సు 56 సంవత్సరాలు మరియు చిన్నప్పటి నుండి ఆమె నటి కావాలని కలలు కన్నారు. ఇలా కృష్ణవేణి హేమగా మనముందు ప్రత్యక్షమైంది. హేమ ప్రేమించిన జాన్ సయ్యద్ ను పెళ్లి చేసుకుని కృష్ణవాణి సయ్యద్ గా మారింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇన్నాళ్ల కెరీర్‌ లో ఎప్పుడు హేమ కాంట్రవర్సీలో ఇరకాలేదు. కానీ ఇటీవల జరిగిన ఓ పార్టీలో ఈమె డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

Exit mobile version