Home Cinema Hema : నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి.. పాజిటివ్ ఆ – నెగటివ్...

Hema : నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి.. పాజిటివ్ ఆ – నెగటివ్ ఆ..?

Hema : రెండు మూడు రోజుల నుండి బెంగుళూరులో రేవ్ పార్టీ గురించి ఎన్ని వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాను ఆన్ చేస్తే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నటి హేమ ఈ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన, బయటకు మాత్రం తానూ హైదరాబాద్ లో ఉన్నానంటూ ఫేక్ ప్రూఫ్ ను సృష్టించింది మరియు ఆ వీడియోలో తానూ పార్టీలో లేనని చెప్పింది.

అయితే బెంగళూరు పోలీసులు మాత్రం హేమ ఈ పార్టీలో పాలుగొన్నదని తేల్చారు. దీంతోపాటు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారంటూ మరో కేసు నమోదు కూడా చేసారు. అయితే ఇటీవల ఈ పార్టీలో దొరికిన అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డ్రగ్ టెస్ట్ కు పంపారు. అందులో నటి హేమ డ్రగ్స్ తీసుకుందని తేలిపోయింది. ఈమెతో పాటు పలువురు ప్రముఖులకు కూడా డ్రగ్స్ పాజిటీవ్ అని తేలడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

tollywood-character-artist-hema-drug-test-results-are-positive

దీంతో హేమ పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హేమ మాత్రమే కాదు, టీవీ నటి ఆషి రాయ్, హేమ స్నేహితుడు చిరంజీవి మరియు వాసు రక్త నమూనాల్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరియు తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కర్ణాటక పోలీసులు వీరు పార్టీ చేసుకునే ఫార్మ్ హౌస్ పై రైడ్ చేయగా, హేమ తన పేరును హేమకు బదులుగా కృష్ణవేణిగా మార్చి చెపింది అని బయటపెట్టారు పోలీసులు.

Exit mobile version