Hero Divorce: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈమధ్య పెళ్లిళ్ల వార్తలకంటే ఎక్కువగా, విడాకులు తీసుకుంటున్న జంటల గురించే సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. ఒక హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కచ్చితంగా కలిసి ఉండలేరు అనే ఉద్దేశ్యానికి వచ్చేసారు. ముఖ్యంగా నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి వార్తలు వినడం చాలా సర్వసాధారణం అయిపోయింది(Hero Aadhi pinisetty Divorce). అయితే సినీ నటులు విడాకులు తీసుకుంటారు అనే ఉద్దేశ్యం జనాల్లో బాగా ఉండడం తో కొంతమంది జ్యోతిష్యం పేరుతో చీకట్లో బాణాలు వదులుతున్నారని నెటిజెన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.
అలాంటి వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి కూడా ఒకడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇతని నోటి నుండి ఎప్పుడు కూడా శుభాలు రావని, ఎంత సేపు ఆ హీరో చనిపోతాడు, వీళ్లిద్దరు విడిపోతారు వంటి కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నాడని మండిపడుతున్నారు. ఈయన గతం లో సమంత మరియు నాగ చైతన్య విడిపోతారని చెప్పుకొచ్చాడు, ఇతను అన్నట్టుగానే అది జరగడంతో అప్పటి నుండి ఈయనకి క్రేజ్ పెరిగింది. అలాగే ప్రభాస్ తో ప్రస్తుతం నిర్మాతలు తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతాయని, అతనితో సినిమాలు చెయ్యొద్దు అంటూ నిర్మాతలకు వార్నింగ్ కూడా ఇచ్చాడు వేణు గోపాల స్వామి.
ఈయన చెప్పే విషయాలను పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిధి అగర్వాల్ వంటి హీరోయిన్స్ ఇతను చెప్పే జాతకాలను నమ్మి ఒక రోజు దోష నివారణ కూడా చేయించుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈయన ప్రముఖ హీరో ఆది – నిక్కీ గిల్రాని జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని, వీళ్లిద్దరి జాతకాలు అసలు ఏమాత్రం కలవడం లేదని చెప్పుకొచ్చాడు(Hero Aadhi pinisetty Divorce). 80 శాతం వరకు వీళ్లిద్దరి విడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటూ బాంబు పేల్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది.
వీళ్లిద్దరు కలిసి తమిళం లో మూడు సినిమాల్లో నటించారు. ఈ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది, ఆ తర్వాత గత ఏడాది వీళ్లిద్దరు పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోతుంది అనే కామెంట్స్ ని తీసుకోలేకపోతున్నారు నెటిజెన్స్. మరి దీనిపై ఆది పినిశెట్టి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఆది తమిళం లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దెగ్గరయ్యాడు. ఈ జంట విడిపోతుంది అని తెలిసి ఫాన్స్ ట్విట్టర్ లో వారి భావాలను పంచుకున్నారు.