Sunday, May 19, 2024
HomeCinemaRajamouli: డేట్స్ లేవని రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోలు విల్లే..

Rajamouli: డేట్స్ లేవని రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోలు విల్లే..

Rajamouli: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో దిగ్గజ స్థాయిలో ఉన్న దర్శకుడు, హీరోలను మించిన స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అతి పెద్ద సూపర్ స్టార్ ఎవరు అంటే, కళ్ళు మూసుకొని మరీ మనమంతా చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి(Heros Who Rejected Rajamouli). ఈ బ్రాండ్ నేమ్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ నుండి హాలీవుడ్ కి ఎగబాకింది. #RRR చిత్రం తో ఆ సాధించిన ఘనత అలాంటిది. తన అద్భుతమైన విజన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మొట్టమొదటి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టేలా చేసాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు హాలీవుడ్ టాప్ గ్రాస్ సాధించిన సినిమాలతో పోటీ పడే రేంజ్ కి ఎదిగింది.

director-rajamouli

అందుకే ఇండియా లో ఉన్న ప్రతీ సూపర్ స్టార్ ఇప్పుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యాలని కలలు కంటున్నారు. ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఆయన స్వయంగా కొంతమంది స్టార్స్ తో సినిమాలు చెయ్యడానికి వెళ్లగా, వాళ్ళు వివిధ కారణాల చేత రాజమౌళి కి డేట్స్ ఇవ్వలేకపోయారు, ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాము. రాజమౌళి తాను తెరకెక్కించిన సినిమాల్లో ఆయనకీ ఎంతో ఇష్టమైన చిత్రం ‘విక్రమార్కుడు’. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఈ చిత్రాన్ని రాజమౌళి తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అని అనుకున్నాడు.

heros-who-rejected-rajamouli

కానీ ఆ సమయం లో ఆయనకి డేట్స్ లేకపోవడం వల్ల ఈ చిత్రాన్ని చెయ్యలేకపోయాడు. అలాగే ‘బాహుబలి’ సిరీస్ రానా పోషించిన భల్లాల దేవా విలన్ పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు లభించిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాత్ర కోసం తొలుత రాజమౌళి బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని సంప్రదించాడు( Heros Who Rejected Rajamouli), కానీ ఎందుకో ఆయన ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఇక ఈ సినిమా ‘శివగామి’ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పాత్రని తొలుత అతిలోక సుందరి శ్రీదేవి తో చేద్దాం అనుకున్నారు.

rajamouli

కానీ ఆమె పెట్టిన డిమాండ్స్ ని తట్టుకోలేక రమ్య కృష్ణ ని తీసుకున్నాం అంటూ రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పగా అది అప్పట్లో సంచలనం గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మగధీర చిత్రం లో సలోని చేసిన ఐటెం సాంగ్ కోసం ముందుగా అర్చన ని అడిగారట. ఇలా ఈ తారలందరూ ఇప్పుడు రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యిందే అని బాధపడుతున్నారు. రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ యాత్ర పూర్తి చేసుకుని, మన భారతదేశపు అన్ని గుడులని కుటుంబంతో సహా విహరిస్తున్నారు. ఈ ఇండియా టూర్ పూర్తయిన వెంటనే సినిమాలు చేయటం ప్రారంభిస్తాడు అంట జక్కన్న, ఫాన్స్ మాత్రం చాల ఎదురుచూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts