Sunday, May 19, 2024
HomeCinemaIleana : ఆ కారణంతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న ఇలియానా.. ఏందంటే..?

Ileana : ఆ కారణంతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న ఇలియానా.. ఏందంటే..?

Ileana : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా వచ్చి తన సొంత టాలెంట్ తో చిరు కంటే పెద్ద స్టార్ అయ్యాడు (Ileana Pawan Kalyan) పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంటే జల్సా అని చెప్పుకోవాలి. జల్సాలో పవన్ కళ్యాణ్ సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించింది. ఈ సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకేక్కిన్చాడు.

ileana-missed-chance-in-blockbuster-movie-alongside-pawan-kalyan-for-the-second-time

జల్సా 2008 విడుదలయింది మరియు అభిమానులను మెప్పించగలిగింది. ఈ సినిమా తరువాత మల్లి ఈ జంట కలిసి పని చెయ్యలేదు. ప్రస్తుతం వీరిద్దరి గురించి ఒక వార్తా వైరల్ అవ్వుతుంది. జల్సా సినిమా తరువాత వీరిద్దరూ కలిసి నటించే ఛాన్స్ వచ్చిందంట కానీ ఈ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయ్యిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి తెలుసుకుందాం. ఇలియానా మరియు పవన్ కళ్యాణ్ జంటగా జల్సా సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాకు ఈ జంట ను అనుకున్నారట గురూజీ.

ileana-missed-movie-with-pawan-kalyan

ఈ సినిమాను బివిఎస్ ప్రసాద్ నిర్మించారు. అయితే ఇందులో ఇలియానా ను అనుకున్న గురూజీ చివరి నిమిషంలో సమంత ను తీసుకున్నారు. జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రణతి శుభాష్ నటిస్తే, నటి నదియా, రావు రమేష్ ముఖ్య పాత్రలో నటించారు మరియు దేవిశ్రీప్రసాద్ స్వరాలూ అందించారు. ఈ సినిమా 2013 సెప్టెంబర్ లో విడుదల అయింది మరియు బారి విజయం అందుకుంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా పైరసీ లీక్ అయ్యింది, ఇది మన టాలీవుడ్లోనే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.

ileana-and-pawan-kalyan

ఇలాంటీ వివాదాల మధ్య అత్తారింటికి దారేది సినిమా బారి విజయం సాధించింది మరియు రికార్డులను తిరగరాసింది. మొదలు ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ప్లేస్ లో ఇలియానా ను అనుకోని విఫలమయ్యారు. ఈ భామ అప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉంది మరియు డేట్స్ కాలిగా లెవ్వు అని తాను చెప్పేసింది. ఆ తరువాత త్రివిక్రమ్ హీరోయిన్ గా ఎవరైతే బాగుంటదని అలోచించి సమంత ను తీసుకున్నారు.

ఇలియానాకు ఆ తరువాత బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా పడలేదు దీనిట్ ఆమె కెరీర్ బాలీవుడ్ లో ముగిసిపోయింది. అత్తారింటికి దారేది సినిమా విజయం తరువాత సమంత ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇలా ఇలియానా పవన్ కళ్యాణ్ సరసన రెండో సారి నటించే అవకాశం వదులుకుంది. (Ileana Pawan Kalyan)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts