Sunday, May 19, 2024
HomeCinemaJr.NTR : ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి శుభవార్త.. కాలర్ ఎగిరేసుకోండి..

Jr.NTR : ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి శుభవార్త.. కాలర్ ఎగిరేసుకోండి..

Jr.NTR : ఎన్టీఆర్ అభిమానులకు ఇది పండగలాంటి న్యూస్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఈ పేరుకు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ నందమూరి వశం నుండి మూడో జనరేషన్ హీరో. ఈ కుటుంబం నుండి మూడవ తరం హీరోలలో ఎందరో హీరోలు వచ్చిన స్టార్ హీరోగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్(Jr NTR is Oscar Member) ఒక్కడే ఆ స్టేటస్ ను పొందగలిగాడు.

jr-ntr-is-oscar-member

ఇక ఇటీవల ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇది మన భారతదేశానికే గర్వ కారణం అని చెప్పాలి. ఈ సినిమాను రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఈయనకు మరొక ప్రత్యేక గౌరవం కూడా దక్కింది. అదేంటంటే, ఆస్కార్ తన వరల్డ్ వైడ్ మెంబెర్స్ లిస్ట్ ను అనౌన్స్ చేసింది.

jr-ntr-is-now-part-of-oscar-members

ఈ లిస్టులో ఇండియా నుండి ఎన్టీఆర్ పేరు ఉండడం ఆయన అభిమానులకు ఆనదని ఇస్తుంది. ఇండియా నుండి ఆస్కార్ మెంబెర్ గా మన తెలుగు నటుడు ఉండడం మన అదృష్టం అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇలా వరుస బెట్టి ఆయనకు ఎన్నో గౌరవాలు దక్కుతున్నాయి మరియు వాటిని తన అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా లో మోస్ట్ ట్రేండింగ్ న్యూస్ గా చెక్కర్లు కొడుతోంది.

jr-ntr-is-the-only-actor-from-india-part-of-oscar-members

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ మరియు శ్రీదేవి కుమార్తె అయినా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. కొరటాల శివ చివరి చిత్రం ఆచార్య డిసాస్టర్ గా నిలిచింది. ఆయన కూడా ఈ సినిమా తో మల్లి ఆయన సత్తా చూపాలి అని పట్టుదలతో ఉన్నారు.

వీరి కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. జనతా గారేజ్ సినిమా బారి విజయం అందుకుంది. మల్లి ఇపుడు వచ్చే దేవర కూడా విజయం అందుకొని ఎన్టీఆర్(Jr NTR is Oscar Member) అభిమానులకు మరింత సంతోషం కలుగజేయాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts