Friday, November 22, 2024
HomeCinemaJr.NTR - Kalyan Ram : ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ఏమని పిలుస్తాడో మీకు...

Jr.NTR – Kalyan Ram : ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ఏమని పిలుస్తాడో మీకు తెలుసా.. నిజమైన రామలక్ష్మణులు..

Jr.NTR – Kalyan Ram : జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు అనే విషయం అందరికి తెలుసు. కానీ వీరి తండ్రి ఒక్కరే అయినా తల్లులు మాత్రం వేరు అనే విషయం కొంతమందికే తెలుసు. కానీ వీరు ఎప్పుడు అలా సవితి పిల్లల కాకుండా సొంత అన్నదమ్ముల (Jr.NTR Kalyan Ram Bonding) కన్నా ఎక్కువగా ఆప్యాతగా ఉంటారు. ఇలాంటి వాలు మన టాలీవుడ్ లోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ బయటకు మాత్రమే ఇలా ఉంటారా అనే సందేహమే లేదు.

kalyan-ram-jr-ntr-bonding-is-lovely-as-kalyan-ram-call-his-brother-nana

వీరు ఇంట్లో కూడా ఇలానే ఆప్యాతగా మరియు ప్రేమగా ఉంటారు. ఒక్కరి సినిమాలలో ఒక్కరు జోక్యం చేసుకొని కెరీర్ బిల్డ్ అవ్వడానికి సలహాలు సుంచనలు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరు హరికృష్ణ పిల్లలు అయినప్పటికీ వీరి తల్లులు వేరు. కళ్యాణ్ రామ్ హరికృష్ణ మొదటి భార్య కొడుకు అయితే తారక్ రెండో భార్య కొడుకు. వీరిద్దరూ తమ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నపటికీ తమ టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో పైకివచ్చారు. కళ్యాణ్ రామ్ తన సినిమాలతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నాడు.

tarak-and-kalyan-ram-bonding

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన మన తెలుగు ఇండస్ట్రీలోనే అల్ రౌండర్ హీరో అని చెప్పుకోవచ్చు. తన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, ఫైట్స్ మరియు సింగర్.. ఇన్ని పనులలో ఆయన దిట్ట అని చూపొచ్చు. టాలీవుడ్ లో సింగల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే అది తారక్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ అన్నదమ్ములు ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికి తెలుసు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను అన్నయ అని ప్రేమగా పిలుస్తాడు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ ను తమ్ముడు అని అస్సలు పిలవాడట.

kalyan-ram-and-ntr-with-hari-krishna

ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఏమని పిలుస్తాడో తెలుసుకుందాం. కళ్యణ్ రామ్ (Jr.NTR Kalyan Ram Bonding) చాలా సార్లు ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్లకు వచ్చాడు మరియు స్టేజిపైన ఎన్టీఆర్ ను నాన్న నాన్న అని నోరారా పిలుస్తాడు. ఆయన బయటే కాదు ఇంట్లో కూడా ఎన్టీఆర్ ను తమ్ముడు అని అనకుండా నాన్న అని ఆప్యాతగా పిలుస్తాడట. వీరిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతారు.

హరికృష్ణ చనిపోయినప్పటి నుండు తన తమ్ముడితో తన తండ్రిని చూసుకుంటున్న అని కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం కూడా ఉంది. వీరిని టాలీవుడ్ రామ లక్ష్మణులు అని అంటుంటారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు మరియు కళ్యాణ్ రామ్ తన పాన్ ఇండియన్ సినిమా కోసం షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts