Monday, May 20, 2024
HomeCinemaYS Raja Reddy: హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న వై ఎస్ షర్మిల కొడుకు రాజా...

YS Raja Reddy: హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న వై ఎస్ షర్మిల కొడుకు రాజా రెడ్డి..

YS Sharmila Son: దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సోదరిగా వై ఎస్ షర్మిల మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలలో అన్నయ్య విజయం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం ప్రత్యేకమైన కృషి చేసింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గానే తెలంగాణ లో వై ఎస్ ఆర్ టీపీ పార్టీ ని స్థాపించి, మరోసారి జనాల్లోకి పాదయాత్ర ద్వారా దూసుకెళ్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గా పని చేస్తుంది.

ys-raja-reddy

అయితే ఈమె గత రెండు రోజుల నుండి ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రెండింగ్ టాపిక్ గా నిల్చింది. రీసెంట్ గానే వై ఎస్ ఆర్ జయంతి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి వై ఎస్ కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. వారిలో షర్మిల కొడుకు వై ఎస్ రాజారెడ్డి కూడా ఉన్నాడు, రీసెంట్ గానే అతడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతూ వస్తుంది. చూసేందుకు అచ్చం యాక్షన్ హీరో లాగ కనిపిస్తున్న రాజారెడ్డి ని చూసి, వై ఎస్ అభిమానులు వెంటనే సినిమా ఇండస్ట్రీ లోకి దింపండి ఇతనిని అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ys-sharmila-son-raja-reddy-into-movies-as-hero

అయితే వాళ్ళు మాటవరుసకి అన్నారేమో కానీ, నిజంగానే వై ఎస్ రాజారెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట(YS Sharmila Son). అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంత కాలం క్రితమే వై ఎస్ షర్మిల ని కలిసి రాజారెడ్డి తో చెయ్యబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని వివరించాడట. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రాన్ని స్వయంగా షర్మిల నే నిర్మించబోతుందట. గతం లో కూడా ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని హీరో గా పెట్టి యోగి అనే సినిమా నిర్మించింది.

ys-jagan-sharmila

సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో సినిమాల జోలికి మళ్ళీ వెళ్ళలేదు షర్మిల. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తన కొడుకు సినిమాని నిర్మించేందుకు ఇండస్ట్రీ లోకి నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమెకి ఈసారైనా సక్సెస్ వస్తుందో లేదో చూడాలి. వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చాల చురుకుగా పనిచేస్తున్నారు. ఖమ్మం నుండి నుంచునే అవకామాషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts