Kangana Ranaut : నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) సిబ్బంది గురువారం ఆమెను చెంప దెబ్బ కొట్టారు. మూలాల ప్రకారం, నటి మరియు రాజకీయ నాయకురాలైన కంగనా తన మొబైల్ ఫోన్‌ను ట్రేలో పెట్టడానికి నిరాకరించి సెక్యూరిటీ గార్డును నెట్టి వెళ్లిపోదామని చూసిందట. దానితో సిఐఎస్‌ఎఫ్ భద్రతా ఎంపీ మరియు నటి అయినా కంగనా పై చేయి చేసుకున్నారు.
కంగనా రనౌత్ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి విస్తారా విమానం ఎక్కాలి. కానీ ఆమె సెక్యూరిటీ చెక్ అప్ ను అతిక్రమించడానికి ప్రయత్నించినందుకు అక్కడ ఉన్న సిబంది ఈ పని చేయాలిసి వచ్చింది. కంగనా మొన్న ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది. ఇలా ఎంపీ గా గెలిచినా కొద్ది రోజులకే రనౌత్ తన పొగరు చూపించడంతో ఈ సంఘటన జరిగింది. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ అవార్డు గ్రహీత అయినా నటి కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను 74,755 ఓట్ల తేడాతో ఓడించారు.
రాజకీయ నాయకురాలిగా తన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కంగనా రానోట్ 5,37,22 ఓట్లు సాధించారు. ఈ ప్రేమ మరియు విశ్వాసానికి మండి ప్రజలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తునాను . ఈ విజయం మీ అందరిదీ, ఇది ప్రధాని మోడీ మరియు బిజెపిపై మీ విశ్వాసం అని మీడియా తన విజయాన్ని ప్రకటించే ముందు సోషల్ మీడియాలో రాశారు. మండి ప్రజలు ఇంత నమ్మిన కంగనా పదవి వచ్చిన కొద్దీ రోజులకే తన నిజస్వరూపం చూపించింది. ఇప్పుడు ఈ వార్తా నేటిన్ట్లో వైరల్ గా మారింది.