survey Report : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరిగాయి అన్న సంగతి మన అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల ఫలితాల కోసం అందరూ అసహనంగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది తమ పార్టీ గలేవాలని కోరుకుంటున్నారు. వైసీపీ గెలుస్తుందని కొందరు పందెం కాస్తుండగా, తెలుగుదేశం కూటమి గెలుస్తుందని కూటమి సభ్యులు బెట్టింగ్ కాస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమికి షాకిస్తూ నాగన్న విచారణ నివేదిక లీక్ అయింది. నాగన్న పోల్ అధికారికంగా ప్రకటించిందో లేదో తెలియదుగానీ, నగానా సర్వే పేరుతో సోషల్ మీడియాలో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. ఇంటర్నెట్ లో దుమారం లేపుతుంది. ఈ సర్వేలో వైసీపీ 96 సీట్లు గెలవడం ఖాయమని, అందులో 22 సీట్లు తృటిలో గెలుస్తాయని ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతుంది. వైస్సార్సీపీ కి మొత్తం 118 సీట్లు ఖాయం అట. ఈ నాగన్న సర్వే ప్రకారం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడనుంది.
కూటమికి 49 సీట్లు మాత్రమే గెలుస్తుందని నగానా పరిశోధనలో తేలింది. ఎనిమిది స్థానాల్లో వైసీపీ, తెలుగుదేశం కూటమి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది అంట. ఈ సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి ఇంతకీ ఆంధ్ర ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు గెలుస్తారో తెలవాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాలిసిందే. ఈ నెల 4వ తేదీన రిజల్ట్స్ వస్తున్నాయి మరియు అందరు ఎంతో అతృతతో వీటి కోసం ఎదురు చూస్తున్నారు.