Keerthy Suresh: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అందం మరియు అభినయం రెండు సమపాళ్లలో కలిగియున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్. మలయాళం లో బాలనటిగా పలు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్. ఆ తర్వాత ‘గీతాంజలి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం లో ఆమె డ్యూయల్ రోల్ చేసింది. ఇక ఆ తర్వాత పలు మలయాళం మరియు తమిళ సినిమాలలో నటించిన కీర్తి సురేష్, తెలుగు లో ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా తొలి సూపర్ హిట్ ని అందుకుంది.
ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలం లోనే సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఎప్పుడైతే ఆమె(Keerthy Suresh) ‘మహానటి’ సినిమా చేసిందో అప్పటి నుండి విలక్షణ నటిగా మారిపోయింది. మహానటి సావిత్రి గా ఇందులో ఆమె నటించలేదు, జీవించింది అనే చెప్పాలి. అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమెకి ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు కూడా దక్కింది. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు ని గెలుచుకున్న ఏకైక స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ చరిత్ర సృష్టించింది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి గర్వకారణం గా నిల్చిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, ఒకవేళ హీరోయిన్ కాకపొయ్యుంటే ఏమి అయ్యేవారు అని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా, ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదానిని అని చెప్పుకొచ్చింది. అందుకోసం ఆమె చెన్నై లో ఫ్యాషన్ డిజైన్ కోచింగ్ కూడా తీసుకుందట. మరో విశేషం ఏమిటంటే ఈమె అక్క రేవతి కూడా ఇండస్ట్రీ లో వీఎఫెక్స్ స్పెషలిస్ట్ గా పనిచేస్తుంది. ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్డి చిల్లీస్ నిర్మించే ఎన్నో సినిమాలకు ఈమె పని చేసింది , ఇప్పటికీ పని చేస్తుంది కూడా.
ఇక కీర్తి సురేష్(Keerthy Suresh) రీసెంట్ గా టాలీవుడ్ లో ‘దసరా’ , మరియు తమిళం లో ‘మామన్నన్’ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 11 వ తారీఖున విడుదల కాబోతుంది.