Home Cinema Mahesh Babu : ఆ సమయంలో కృష్ణకు కోపం తెప్పించిన మహేష్ బాబు.. కారణం ఏంటంటే..

Mahesh Babu : ఆ సమయంలో కృష్ణకు కోపం తెప్పించిన మహేష్ బాబు.. కారణం ఏంటంటే..

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తొలీవూడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అందరి దృష్టిని కూడా ఆకర్షించాడు. ఈయన తదనంతరం వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మహేష్ బాబు తన ప్రతిభతో ఎదిగాడు. మహేష్ బాబును సినిమాలో తన చిన్నతనం నుండే నటించే వాడు. కృష్ణ కూడా మహేష్ ను బాగా ఎంకరేజ్ చేసారు.

అయితే ఇటీవల కృష్ణ మరియు మహేష్ బాబుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు కెరీర్‌లో సూపర్ బ్లాక్బస్టర్ మురారి ఒకటి. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ పాట షూటింగ్ సమయంలో మహేష్ బాబు బారి జ్వరం వచ్చిందట. డాక్టర్ బయటకు వస్తే అస్సలు మంచిది కాదు అని కూడా హెచ్చరించారట. జ్వరం వచ్చినప్పుడు ఒళ్లు అలసిపోవద్దని, అది ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే.

krishna-angry-on-mahesh-babu-at-murari-time

ఈ సన్నివేశాన్ని చిత్రీకరించవద్దని కృష్ణవంశీకి కూడా కృష్ణ సలహా ఇచ్చాడట. అయితే మహేష్ బాబు తన వల్ల ఇతరులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. అయితే మహేష్ బాబు కంప్రమైస్ అవకపోవడంతో కృష్ణవంశీ షూటింగ్ ముగించారట. కానీ దేవుడి దయ వల్ల మహేష్ బాబు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో కృష్ణకు మహేష్ బాబుపై విపరీతమైన కోపం వచ్చింది. కానీ సినిమా హిట్ అయ్యాక ఆ కోపం అంతా పోయింది. మురారి సినిమా మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

Exit mobile version