Home Sport Mohammed Siraj : ఒక ఇంటి వాడు అవ్వబోతున్న మహమూద్ సిరాజ్.. వధువు ఎవరంటే..

Mohammed Siraj : ఒక ఇంటి వాడు అవ్వబోతున్న మహమూద్ సిరాజ్.. వధువు ఎవరంటే..

Mohammed Siraj : ఇటీవల జరిగిన ప్రపంచకప్ సిరీస్‌లో భారత జట్టు ఫైనల్ చేరేందుకు మహ్మద్ సిరాజ్ ఎలా సహకరించాడో చూశాం. చాలా మ్యాచ్‌ల్లో అతను తీసిన వికెట్లు నిర్ణయాత్మకమైనవి. ఫైనల్‌లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేకపోయినా, అంతకుముందు గేమ్‌లో మహ్మద్ సిరాజ్ పాత్ర గొప్పదనే చెప్పాలి. ఊహించినట్లుగానే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో అభిమానులు ఇంకా ఉలిక్కిపడ్డారు.

సిరాజ్ హైదరాబాద్ వాసి అయినప్పటికీ భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈయన ఐపీల్ లో కూడా ఎన్నో సంవత్సరాల నుండి రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇతన్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఇదిలా ఉంటే మహ్మద్ సిరాజ్ తన అభిమానులకు శుభవార్త అందించాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఓ ఇంటివాడు అవ్వడబోతున్నాడు అంటూ ఓ వార్త నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది.

indian-international-cricketer-mohammed-siraj-marriage-news-is-all-over-internet

ఆడెనటంటే సిరాజ్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. డిసెంబర్ చివరి వారంలో నిశ్చితార్థం మరియు మార్చి నెలాఖరులో పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లందరూ కూడా వివాహ వేడుకలో పాల్గొంటారు అంటూ ఎన్నో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వార్తలు నిజామా అనేది తెలవాలంటే సిరాజ్ స్పందించే వరకు వేచి ఉండాలిసిందే.

Exit mobile version