Krishna Vamshi : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. కృష్ణవంశీ(Krishna Vamshi Sangeetha) తెరకెక్కించిన సినిమాలు ఎన్నో అవార్డులు అందుకున్నాయి. గులాబీ, నిన్నే పెళ్ళాడుతా సినిమాతో కృష్ణవంశీ ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో జాతీయ సమగ్రత భావంతో తెరకెక్కించిన సినిమా ఖడ్గం. ఈ సినిమాకు నంది అవార్డుల పంట పండింది.
అప్పట్లో ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఆ సినిమా విడుదలై ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటికీ కూడా ఆగస్ట్ 15, జనవరి 26వచ్చిందంటే చాలు ఆ సినిమా టీవీల్లో ప్రసారమై ఫుల్ టీఆర్పీ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలోని ఎన్నో సీన్స్ నేటికీ సగటు ప్రేక్షకుడి కళ్లెదుట కదలాడుతూనే ఉన్నాయి. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోకి ఖడ్గం ప్రత్యేకం. ఇందులో కృష్ణవంశీ తీసిన కొన్ని రియాలిటీకి దగ్గరగా ఉండే సన్నివేశాలకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అయితే సినిమాలోని కొన్ని సీన్స్ మాత్రం కాంట్రవర్సీలకు దారి తీశాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ వంశీ ఖడ్గం సినిమా విశేషాలు, సీక్రెట్స్ బయటపెట్టారు. ఖడ్గం చిత్రంలోని నటుడు పృథ్వీ రాజ్ పాత్రను బాలకృష్ణను ఉద్దేశించే పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన కథనాలు పలు సందర్భాల్లో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో బాలకృష్ణ అభిమానులు కృష్ణవంశీపై ఫైర్ అయ్యారు. అయితే అదే విషయాన్ని తాజాగా ప్రస్తావనకు తీసుకొచ్చారు కృష్ణవంశీ. జరిగిన విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.
పృథ్వీ రాజ్ పాత్ర ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని తెలిపారు. ఆ పాత్రను పెట్టడం వల్ల చాలా నష్టపోయానన్నారు. బాలయ్య బాబులా డైలాగ్ లు ఎవరు చెప్పలేరని.. అజ్ఞానం, అమాయకత్వంతో సృష్టించిన ఆ పాత్రకారణంగా చాలా మంది తనపై కక్ష పెంచుకున్నారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాలో రవితేజ కి జోడి హీరోయిన్ సంగీత(Krishna Vamshi Sangeetha) నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం హీరోయిన్లను హీరోలు, దర్శకులు ఎలా వాడుకుంటున్నారన్న అంశాన్ని సంగీత పాత్ర ద్వారా కృష్ణవంశీ చక్కగా చూపించారు.
అప్పట్లో ఇది ఓ సంచలనం రేపింది. బెడ్ రూంలో సంగీత దర్శకుడితో అలా కనిపించిన సీన్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది అనడంలో సందేహం లేదు. ఆ పాత్రతో ఇండస్ట్రీలో తెర వెనుక తతంగాలను రివీల్ చేశారని ఆయనను జనాలు మెచ్చుకున్నారు కూడా.. ప్రస్తుతం సినిమాల రేసులో వెనుకబడ్డ కృష్ణవంశీ ఇటీవల ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కథనం బాగున్నప్పటికీ ఎందుకో ప్రేక్షకులను ఒప్పించలేకపోయింది.