Wednesday, May 8, 2024
HomeCinemaVijay Devarakonda : విజయ్ దేవరకొండను తొక్కేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు హీరోలు వీరే..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండను తొక్కేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు హీరోలు వీరే..

Vijay Devarakonda : తెలుగు సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో దేశమంతా విజయ్ దేవరకొండపై(Vijay Devarakonda Kushi) దృష్టిపడింది. తనదైన స్లాంగ్ డైలాగులతో రౌడీ బాయ్ గా పిలిపించుకున్నారు. ప్రస్తుతం రౌడీ హీరోగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన మార్కు సినిమాలతో దూసుకుపోతున్నారు. లైగర్ తన కెరీర్లోనే భారీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.

these-star-heros-angry-on-vijay-devarakonda

తాజాగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఖుసి సినిమా విడుదలైన ప్రతీ చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆనందంలో మునిగిపోయారు విజయ్ దేవరకొండ. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త దావాలంలా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. నిజానికి హీరో విజయ్ దేవరకొండది తెలంగాణ. దీంతో తెలంగాణ నుండి వచ్చిన చాలామంది నటీనటులను ఆంధ్ర వాళ్లు తొక్కేస్తారన్న భావన ఇండస్ట్రీలో ఉండనే ఉంది.

star-heros-angry-on-vijay-devarakonda

కానీ వారిని అందరినీ దాటుకుంటూ విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డారు.. పడుతున్నారు కూడా. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. మధ్యలో చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా… ప్రస్తుతం ఖుషి సినిమాతో అందర్నీ ఫుల్ ఖుషి చేశాడు. అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. టాలీవుడ్ కు చెందిన ఏ ఒక్క హీరో కూడా సినిమా హిట్ అయినందుకు విష్ చేస్తూ ఒక్క ట్వీట్ చేయకపోవడం గమనార్హం.

vijay-devarakonda

దీంతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఉండే హీరోలకు మా హీరో అంటే కుళ్లుకుంటున్నారు. ఆయన స్టార్ హీరోగా ఎదగడం చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఆయన సినిమా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతున్నా.. ఆయనను సపోర్ట్ చేస్తూ ఒక్కటంటే ఒక్క అప్రిషియేషన్ ట్వీట్ ఇవ్వలేదు. హీరోల నుంచి ఆయనకు ఎంకరేజ్ కరువవ్వడం చూస్తూ ఆయనను తొక్కేయాలని చూస్తుండడం అర్థం అవుతోంది.

కానీ ఎవరు ఏం చేసినా కూడా నిజమైన టాలెంట్ ను తొక్కేయడం ఎవరివల్లా సాధ్యం కాదు.. అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాలర్ ఎగరేసి దటీజ్ రౌడీ బాయ్ అంటున్నారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda Kushi) ఖుషి సినిమాని తెలుగులోని ఏ హీరో కూడా అభినందించకపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts