Sunday, May 19, 2024
HomeCinemaMahesh Babu: ఆ అలవాటు మానుకోలేక నరకం అనుభవిస్తున్న మహేష్ బాబు.. ఎంత ప్రయత్నించినా..

Mahesh Babu: ఆ అలవాటు మానుకోలేక నరకం అనుభవిస్తున్న మహేష్ బాబు.. ఎంత ప్రయత్నించినా..

Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రసుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే చిత్రం లో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది(Mahesh Babu Addiction). యావరేజి సినిమాలను సైతం సూపర్ హిట్ రేంజ్ కి తీసుకొని వెళ్లగలిగే సత్తా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలా క్రేజీ కాంబినేషన్ తో సినిమా తీస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయన నుండి సినిమా విడుదలై ఏడాది దాటింది. గుహ నెల మే 12 వ తారీఖున ‘సర్కారు వారి పాట’ చిత్రం తో మన ముందుకి వచ్చిన మహేష్ బాబు, ఈ ఏడాది మాత్రం ఖాళీగా ఉంచేసాడు.

mahesh-babu-addiction

వచ్చే సంక్రాంతి వరకు మహేష్ బాబు ని వెండితెర మీద చూడలేరు అభిమానులు. ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఆయన రాజమౌళి తో చెయ్యబోయే సినిమా కోసం డేట్స్ కేటాయించబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే మహేష్ కి సంబంధించిన ఒక విషయం రీసెంట్ గా ఆయన నోటి నుండే బయటపడి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు రీసెంట్ గా ‘బిగ్ సి’ 12 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు.

mahesh-babu-media

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా ఆయనకీ ఉన్న వ్యసనం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ మహేష్ కూడా అందరి లాంటి వాడే అని అనిపించేలా చేసింది. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి మహేష్ సమాధానం చెప్తూ ‘అందరి లాగానే నాకు కూడా ఫోన్ ని విపరీతంగా వాడే అలవాటు ఉంది. ఉదయం లేవగానే ఫోన్ ని చూస్తాను, అలా గంటల తరబడి ఫోన్ చూడడం అలవాటు అయిపోయింది(Mahesh Babu Addiction). కొన్ని కొన్ని సార్లు అధికంగా ఫోన్ వాడడం వల్ల తల నొప్పి కూడా బాగా వచ్చేస్తుంది.

hero-mahesh-babu

ఈ వ్యసనపు అలవాటు ని ఎంత తగ్గించుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. తనకు ఎప్పటి నుండో మైగ్రేన్ సమస్య ఉంది అని, తనకు ఒకేసారి భరించలేనంత తలనొప్పి వస్తుంది అని, అలా తల నొప్పి వచ్చినపుడు లైట్ నిగాని ఎక్కువ శబ్దాలు కానీ వినిపించిన అస్సలు తట్టుకోలేడు అని చెప్పాడు మహేష్ బాబు.

ఎన్నో ఇంగ్లీష్ మందులు వాడిన తగ్గని మైగ్రేన్ నాకు ఒక నాటి వాద్యం వల్ల తగ్గింది అని స్టేజి మీదే అందరి ముందు చెప్పాడు మహేష్ బాబు. రాజమౌళి తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ప్రస్తుతం ఆ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts