Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ , మాస్ , క్లాస్ , ఫ్యామిలీ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను తన సినిమాలకు క్యూలు కట్టేలా చేసే రేంజ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో మహేష్ బాబు కూడా ఒకడు. ప్రస్తుతం అయితే ఆయన యావరేజి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయిలు అవలీల గా రాబడుతున్నాయి (Mahesh Babu Cancelled Movies). ఇప్పుడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ నుండి రాబోతున్న మూడవ సినిమా కావడం తో ఈ చిత్రం పై ట్రేడ్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు (Mahesh Babu Cancelled Movies). ఇది ఇలా ఉండగా మహేష్ ఒక సినిమా చెయ్యాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు, కథలో వైవిద్యం ఉంటేనే ఆయన ఒక సినిమాకి ఓకే చెప్తాడు.
కథ నచ్చకపోతే శంకర్ లాంటోళ్లను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా గతం లో ఆయన ఎన్నో సినిమాలను ప్రకటించిన తర్వాత ఆపేసాడు. ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘హరే రామ హరే కృష్ణ’ అనే చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్టు గతం లో ఒక అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఎందుకో ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ తో ‘శివమ్’ అనే చిత్రాన్ని ప్రకటించారు, ఈ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా సురేందర్ రెడ్డి తో ‘మిస్టర్ పర్ఫెక్ట్ అనే చిత్రాన్ని కిక్ సినిమా విడుదల కొత్తల్లో ప్రకటించారు, ఇది కూడా ఎందుకో సెట్ అవ్వలేదు.
ఆ తర్వాత వీవీ వినాయక్ తో ఒక సినిమా, అలాగే పూరి జగన్నాథ్ తో ‘జన గణ మన’ అనే సినిమా కూడా ప్రకటించిన తర్వాత ఆగిపోయాయి. ఇవి ఇలా కార్య రూపం దాల్చకపోవడానికి కారణం మహేష్ కి కథలు నచ్చకపోవడం వల్లే. అందుకే మహేష్ తో ఒక సినిమా ఒప్పించడం అనేది సాధారణమైన విషయం కాదని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఎప్పటి నుండో నడుస్తుంది. ఇకపోతే మహేష్ బాబు రాజమౌళితో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజమౌళి ముగ్గురు బాలీవుడ్ బామ్మలను దింప బోతున్నాడు అంటే సినీ వర్గాల్లో టాక్.