Wednesday, July 3, 2024
HomeCinemaPrabhas : కల్కి 2898 AD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులు...

Prabhas : కల్కి 2898 AD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులు వీరే.. నాగ్ అశ్విన్ బానే ప్లాన్ చేసాడు..

Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈయన పాన్-ఇండియన్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రభాస్ ఇటీవల కల్కి 2898 AD సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ రాసుకొని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్యాషన్ తో తీస్తున్నారు ఈయన. ఈ సినిమా ను అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు అని అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో దిశా పటానీ, దీపికా పదుకొణె కథానాయికలుగా నటిస్తున్నారు.

అమితా బచ్చన్ – కమలహాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసారు. మనకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌ను మే 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నాగ్ అశ్విన్ మొత్తం 5-స్టార్ హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

nag-ashwin-invited-this-star-celebrities-for-kalki-2898-ad-movie-pre-release-functiom

ఈ సినిమా ఈవెంట్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి మరియు రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇది చూసిన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాపై అభిమానులలో బారి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రభాస్ చేతిలో సాలార్ రెండో పార్ట్, స్పిరిట్, రాజాసాబ్ సినిమాలు ఉన్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts