Friday, May 10, 2024
HomeCinemaPrabhas : ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫాన్స్ కి పండగే..

Prabhas : ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఫాన్స్ కి పండగే..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి సినిమా విడుదల డేట్ వచ్చేసింది. కల్కి 2898 AD సినిమా సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో బారి స్టార్ క్యాస్ట్ ఉంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే నటిస్తుంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. అభిమానుల్లో ఈ సినిమా హైప్ మామూలుగలేదు.

ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా బారి విజయం సాధించడంతో కల్కి సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది అన్నడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి రేపు సాయంత్రం భారీ ప్రకటన ఉంటుందని మేకర్స్ నిన్న రాత్రి ప్రకటించారు. తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు.

kalki-cinema-release-date-fixed

ఇదిలా ఉంటే, జూన్ 27న కల్కి 2898 ADని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు క్రియేటర్స్. ఈ సినిమాకు సంబందించిన ఓ గ్లిమ్ప్స్ ను మొన్న విడుదల చేసారు చిత్ర యూనిట్. ఆ గ్లిమ్ప్స్ లో అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేసారు. ఈ గ్లిమ్ప్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మరి అందరిలోనూ భారీ ఆశలు రేకెత్తించిన ఈ సినిమా విడుదల తర్వాత ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts