Saturday, November 23, 2024
HomeCinemaNaga Babu: నిహారిక జీవితం గురించి భయపడుతున్న మెగా బ్రదర్ నాగబాబు..

Naga Babu: నిహారిక జీవితం గురించి భయపడుతున్న మెగా బ్రదర్ నాగబాబు..

Naga Babu: ఈ మధ్య కాలం లో మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న సంఘటన ఎంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అసలే పొలిటికల్ నేపథ్యం ఉన్న ఒక కుటుంబం లో ఇలాంటి వార్తలు వస్తే జాతీయ స్థాయిలో సిర్క్యులేట్ అవుతాయి. అందుకే ఇలాంటి విషయాలను బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతారు కొంతమంది ప్రముఖులు (Naga Babu In Fear). అలాగే నిహారిక విడాకులు సంగతి కూడా గోప్యంగా ఉంచుదాం అని అనుకున్నారు కానీ, అది సాధ్యపడలేదు.

naga-babu-in-fear-about-niharika

సోషల్ మీడియా ఈ రేంజ్ లో వృద్ధి చెందడం తో విషయం కూడా గోప్యం గా ఉండడం లేదు. అలాగే నిహారిక విషయం లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. విడాకుల పాత్రలతో సహా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు నిహారిక విషయం లో తెగ భయపడిపోతున్నాడట(Naga Babu In Fear). ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి సినీ సెలెబ్రిటీల విషయం లో ఏది చెప్పినా వెంటనే జరిగిపోతూ ఉంది. ఆయన చీకట్లో బాణం వేస్తున్నాడో, లేకపోతే సినీ ఇండస్ట్రీ లో ఉండేవాళ్లంతా ఇంతే అని అలా చెప్తున్నాడో తెలియదు కానీ, ప్రతీ ఒక్కరికి ఈయన చెప్పినవి చెప్పినట్టు తూచా తప్పకుండ జరిగింది.

naga-babu-niharika-konidela

నిహారిక మొదటి పెళ్లి పెటాకులు అవుతుందని నేను ఎప్పుడో చెప్పాను. అంతే కాకుండా ఆమె జాతక రీత్యా రెండవ పెళ్లి కూడా చేసుకుంటుంది. కానీ ఆమెకి సంతాన యోగం లేదని చెప్పొచ్చాడు వేణు గోపాల స్వామి. దీనికే నాగబాబు ప్రస్తుతం బయపడుతున్నాడు. గత కొంతకాలం నుండి ఆయన వివిధ జ్యోతిష్య ప్రముఖులతో చర్చలు జరిపి దోష పరిహారణ జరిపించే ప్రయత్నాలు చేస్తున్నాడట. నిహారిక పెళ్లిని ఆయన ఎంత అంగరంగ వైభవంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఇంటర్నెట్ లో ‘నిశ్చయ్’ అనే ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఎన్నో వేల ఫోటోలు కనిపిస్తాయి.

niharika-konidela

అంత వైభోగంగా రాజస్థాన్ లో మూడు రోజుల పాటు జరిపించాడు. సోషల్ మీడియా లో సుమారుగా దీని గురించి వారం రోజుల పాటు చర్చ కూడా జరిగింది. అలా జరిగిన పెళ్లి కాబట్టే ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, రెండేళ్లు కూడా గడవకముందే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా నిహారిక హాట్ స్టార్ లో డెడ్ పిక్సెల్ అనే ఒక వెబ్ సిరీస్ చేసింది ఆ వెబ్ సిరీస్ లో తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయితో లవ్ లో ఉందని, త్వరలో రెండో పెళ్లి కూడా తననే చేసుకోబోతుంది అని కూడా ఉకారులు వచ్చాయి. దీనిపై నిహారిక ఎం స్పందించలేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts