Sunday, May 19, 2024
HomeCinemaNaga Chaitanya: శోభిత నాగ చైతన్య పెళ్లి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన..

Naga Chaitanya: శోభిత నాగ చైతన్య పెళ్లి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన..

Naga Chaitanya : సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే హీరోల లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగ చైతన్య పేరు కచ్చితంగా ఉంటుంది. ఆయన క్రేజీ అవ్వడం మాత్రం కాకుండా, సమంత ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం అందుకు కారణం(Naga Chaitanya Sobhita). జనాలకు వీళ్లిద్దరు విడిపోవడం అసలు నచ్చలేదు. ఎంతో క్యూట్ గా, ఒకరికోసం ఒకరు పుట్టారు అని అనిపించే రేంజ్ లో ఉండే ఈ జంట విడిపోయింది అంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు విడిపోయి రెండేళ్లు దాటింది. ఇద్దరూ ఒకరిని ఒకరు మర్చిపోయి, ఎవరి కెరీర్ ని వారు చూసుకుంటున్నారు.

nagachaitanya-sobhita

ఇది ఇలా ఉండగా నాగ చైతన్య త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది. ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ఆయన చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాకుండా వీళ్లిద్దరు కలిసి డిన్నర్లకు వెళ్లడం, ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, వరల్డ్ టూర్స్ కి ట్రిప్ వెయ్యడం వంటివి జరుగుతూనే ఉన్నాయి(Naga Chaitanya Sobhita). ఇదంతా చూసి కూడా వీళ్ళ మధ్య ఏమి లేదంటే ఎవరు మాత్రం నమ్ముతారు?. కానీ రీసెంట్ గా గత వారం రోజుల నుండి నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది నిజమే కానీ.

naga-chaitanya

అది శోభిత తో కాదు, ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురుతో పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నాగ చైతన్య టీం స్పందిస్తూ సోషల్ మీడియా లో నాగ చైతన్య ఒక పారిశ్రామిక వేత్త కూతురుని పెళ్లాడబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. డిసెంబర్ లో నాగ చైతన్య – శోభిత పెళ్లి ఘనంగా జరగబోతుంది అని కూడా ఒక రూమర్ ఉంది, త్వరలోనే నాగ చైతన్య ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తాడట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

sobhita-dhulipala

ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ‘కస్టడీ’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత నాగ చైతన్య చందు మొలేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆయన కెరీర్ లోనే ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. నాగ చైతన్య చేతిలో అసలు ఒక సినిమా కూడా లేదు ప్రస్తుతం ఐతే. కొంత మంది టాప్ డైరెక్టర్ లు తనకు కథ చెప్పిన రిజెక్ట్ చేసేసాడు అంట స్టోరీ నచ్చక.

నాగ చైతన్య ప్రస్తుతం కొత్త టాలెంట్ కోసం చూస్తున్నాడు అని సినీ వర్గాల్లో సమాచారం. మంచి కథ ఉంటె ఎవరితో నైనా సినిమా చేయటానికి నాగ ఛైతన్య సిద్ధంగా అట. ఈ విషయం తెలుసుకొని ఎంతో మంది కుర్ర డైరెక్టర్లు నాగ చైతన్య కు కథ చెప్పటానికి సందర్శిస్తున్నారు అట.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts