Home Cinema మహేష్ రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో.. ఫాన్స్ కు పండగే..

మహేష్ రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో.. ఫాన్స్ కు పండగే..

దర్శక దీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా బారి విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను అనౌన్స్ చేసారు. తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అన్ని ఎదురుచూస్తున్నా సినిమా రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా. మహేష్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి తో చేయబోయే సినిమా కోసం వర్క్ ఔట్స్ మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాలుగొంటున్నాడు.

nagarjuna-in-mahesh-babu-rajamouli-film

ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాసారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చూపించారు. ఈ సినిమాలోని ఓ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం విశేషం. రాజమౌళి మహేష్ తో సినిమా ఇప్పటికే అనౌన్స్ చేసారు మరియు ఈ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు షేర వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత కీరవాణి పని చేస్తున్నారు. ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి మరియు ప్రపంచం అంత వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది.

ఇదిలా ఉంటె, ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, రాజమౌళి – మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో మరో తెలుగు స్టార్ హీరో కూడా ఉన్నారట. ఇటీవల కాలంలో మల్టీ స్టార్రర్స్ చాలా కామన్ అయిపోయాయి. హీరోలు కూడా ఇలాంటి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున. దీనితో ఈ సినిమాకు మరింత హైప్ వస్తుంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఏదిఏమైనా ఈ వార్తా నిజం అవ్వాలని మన అందరం కోరుకుందాం.

Exit mobile version