Nagarjuna: ప్రస్తుతం టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ హీరోల తర్వాత అత్యంత దయనీయ పరిస్థితిలోకి చేరిన మరో కుటుంబం అక్కినేని హీరోలు. గత రెండేళ్ల నుండి ఈ హీరోలకు పాపం ఏది కలిసి రావడం లేదు, చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. ఆఫ్ బీట్ సినిమాలను చేస్తూ అక్కినేని నాగార్జున తన మార్కెట్ మొత్తాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు(Nagarjuna Sons). ఆయన మార్కెట్ పోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన వయస్సు 60 ఏళ్ళు ఎప్పుడో దాటేసింది. ఆయన తరం లో ఎన్నో సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని టాప్ 3 స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగాడు.
ఇప్పటికీ ఆయన హిట్ కొడితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలడు అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది అలాగే ట్రేడ్ లో కూడా ఉంది. కానీ కొడుకుల పరిస్థితే అత్యంత దయనీయంగా మారింది(Nagarjuna Sons). అక్కినేని నాగ చైతన్య నిన్న మొన్నటి వరకు వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ ని కొనసాగించాడు. కానీ ‘థాంక్యూ’ చిత్రం నుండి ఆయన బ్యాడ్ టైం ప్రారంభం అయ్యింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక అఖిల్ సంగతి సరేసరి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సరైన హిట్ లేదు.
రీసెంట్ గా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్‘ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో నాగార్జున కొడుకులిద్దరి భవిష్యత్తు ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లోనే ఇద్దరు ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తిని మ్యానేజర్ గా అపాయింట్ చేసాడు. అంతే కాదు అఖిల్ ని నటన లో మరింత మెరుగుపర్చడానికి నాగార్జున ఆదిశక్తి థియేటర్ లో జాయిన్ చేసాడు. అక్కడే ఆయన కొద్దిరోజుల పాటు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. నాగ చైతన్య కూడా త్వరలోనే ఆ స్కూల్ లో చేరబోతున్నాడట.
ఇకపోతే అఖిల్ తదుపరి చిత్రం పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, నాగ చైతన్య తదుపరి చిత్రం మాత్రం చందు మొలేటి దర్శకత్వం లో ఉండబోతుంది. గీత ఆర్ట్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతుంది. కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, అక్కినేని నాగ చైతన్య ఫాన్స్ ఈ ప్రాజెక్ట్ పైనే తమ ఆశలు అన్ని పెట్టుకున్నారు. హిట్ ఐతే వారిని ఎవ్వరు ఆపలేరు, ఫాట్ ఐతే మాత్రం ఇంకా వీరిని ఎవ్వరు లేపలేరు, నాగ చైతన్య ఇక అవుట్ అనే చెప్పుకోవచ్చు.