Namitha: సౌత్ ఇండియా లో కుర్రకారులు వెర్రిక్కిపోయి దేవత లాగ ఆరాధించిన కొంత మంది హీరోయిన్స్ ఉన్నారు. వీళ్లకు ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా మంది సూపర్ స్టార్స్ కి కూడా లేదు, వీళ్ళకి ఏకంగా దేవాలయాలు కూడా కట్టేసారు. అలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు నమిత. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘జెమినీ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన నమిత, ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కింది.
టాలీవుడ్ లో కంటే ఆమెకి కోలీవుడ్ లోనే ఎక్కువ హిట్స్ వచ్చాయి. అక్కడికురాళ్లు ఈమె(Namitha) అందాన్ని చూసి మెంటలెక్కిపోయారు. ఆమెకి దేవాలయాలు కూడా కట్టారు. అప్పట్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ కుష్బూ కి ఇలా చేసారు. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి ఆదరణ, అభిమానం కేవలం నమిత కి మాత్రమే దక్కింది. ఇంత అందం ఉన్న హీరోయిన్స్ కి అఫైర్స్ లేకుండా ఎందుకు ఉంటాయి? కచ్చితంగా ఉంటాయ. అందులో ఎన్ని నిజాలు, ఎన్ని రూమర్స్ అనేది పక్కన పెడితే ఈమె ప్రముఖ తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ తో చాలా రోజులు డేటింగ్ చేసినట్టు బహిరంగంగానే అందరికీ దొరికిపోయారు.
ఆ తర్వాత శరత్ కుమార్ భార్య రాధికా గొడవ చేసి జోక్యం చేసుకోవడం తో విషయం సర్దుకుంది. ఇక నమిత(Namitha) కేవలం శరత్ కుమార్ తో మాత్రమే కాదు, బిల్లా సినిమా సమయం లో ప్రభాస్ తో, సొంతం సినిమా షూటింగ్ సమయం లో ఆర్యన్ రాజేష్ తో కూడా లవ్ ట్రాక్స్ నడిపినట్టు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇక తమిళ సీనియర్ హీరో సత్యరాజ్ తో కూడా ఈమె డేటింగ్ చేసిందట, చివరికి సీనియర్ హీరోయిన్ కుష్బూ భర్త సుందర్ తో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీళ్ళతో పాటు తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకుడితో కూడా ఈమె డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో కోలీవుడ్ మొత్తం కోడై కూసింది.
ఆ తర్వాత ప్రేమిస్తే భరత్ తో కొన్నాళ్ళు. కూడా లవ్ ట్రాక్ నడిపినట్టు తెలుస్తుంది. అలా అంత మందితో ప్రేమాయణం నడిపిన ఈమె, చివరికి తమిళ నిర్మాత వీరేంద్ర చౌదరి ని ప్రేమించి పెళ్ళాడి ఇద్దరి కవలపిల్లలకు జన్మని ఇచ్చింది. ప్రస్తుతం అతనితోనే తన సంసారం జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తుంది. సినిమాలు చేసి చాల రోజులు అయింది నమిత. ఇకపై చేస్తుందో లేదో కూడా తెలీదు. ప్రస్తుతం ఐతే మంచి సెటిల్డ్ జీవితాన్ని గడుపుతుంది నమిత అనే చెప్పుకోవాలి.