Home Cinema NTR: పాలిటిక్స్ లోకి తిరిగి రాబోతున్న ఎన్టీఆర్.. ఆ రోజు కోసం వెయిటింగ్..

NTR: పాలిటిక్స్ లోకి తిరిగి రాబోతున్న ఎన్టీఆర్.. ఆ రోజు కోసం వెయిటింగ్..

NTR: తెలుగు దేశం పార్టీ ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియా లో తీస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలే అందరికీ గుర్తుకువస్తాయి. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వారసులు ఉండగా తెలుగు దేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు కి ఆయనకీ వారసులకు ఎలా చెందుతుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కాలం ఉంది గొడవలు చేస్తూనే ఉన్నారు(NTR Into Politics). నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ చాలా గట్టిగానే ఉంటుంది.

ntr-into-politics

ఆయన అడుగుపెట్టిన ప్రతీ చోట ఎన్టీఆర్ బ్యానర్స్ కనిపిస్తున్నాయి. లోకేష్ మాట్లాడుతున్న సమయం లో జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఫ్యాన్స్. జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రముఖ సీనియర్ నిర్మాత చిట్టి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రాడు, తెలుగు దేశం పార్టీ సంపూర్ణంగా పతనం అయిపోతుంది అని అనుకున్న సమయం లో వస్తాడు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి, అవి చేసుకోనివ్వండి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే అభిమానులు కోరుకున్నట్టు ముఖ్యమంత్రి అయిపోడు.

జనాలు ఇతను ముఖ్యమంత్రి అయితే మాకు ఏమైనా మంచి జరుగుతుంది అని నమ్మితేనే ఓట్లు వేస్తారు’ అంటూ చెప్పొచ్చాడు చిట్టిబాబు(NTR Into Politics). ఈయన టాలీవుడ్ సెలబ్రిటీస్ గురించి గత కొంతకాలం నుండి కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అంతకు ముందు సమంత మీద కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అలా తరచూ సెలబ్రిటీస్ మీద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అయ్యే చిట్టి బాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి వచ్చిన తర్వాత కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. నవంబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’ మరియు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో కోసం ఫాన్స్ చాల ఎదురు చూస్తున్నారు. వీళ్లిద్దరి కాంబో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వాస్తుని అంటున్నారు ఫాన్స్.

Exit mobile version