NTR31: ఒక్కే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈయన కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియ లెవెల్ లో బారి విజయం సాధించింది మరియు దర్శకుడిగా తనకు మంచి గుర్తింపు తెపించింది. ప్రశాంత్ నీల్ కనడ సినిమా పరిశ్రమకు చెందిన డైరెక్టర్ (Kamal Hassan In NTR31). అక్కడ ఆయన కేజిఎఫ్ కంటే ముందు ఓ సినిమా చేసారు. తన మొదటి చిత్రం తోనే కనడ ఫిలిం ఇండస్ట్రీలో హిట్ అందుకున్నాడు మరియు తన సెకండ్ ప్రాజెక్ట్ కేజిఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకొని ఇపుడు టాలీవుడ్లోని బడా హీరోలతో సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ తో సాలార్ అనే మరో పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. దీని షూటింగ్ లో ప్రశాంత్ నీల్ బిజీ బిజీ గా ఉన్నాడు మరియు ఈ సినిమా యొక్క గ్లిమ్ప్స్ ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. దీనికి బార్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ రెండో భాగం తీసేటప్పుడే ప్రభాస్ తో తన సాలార్ సినిమాను అనౌన్స్ చేసాడు మరియు ఆ సినిమా షూటింగ్ అయిపోయి విడుదల అవ్వకముందే సాలార్ షూటింగ్ మొదలు పెట్టేసారు. ఇపుడు ఆయన ప్రభాస్ తో చేసే సాలార్ సినిమా షూటింగ్ ఇపోకముందే ఎన్టీఆర్ తో NTR 31 అధికారిక ప్రకటన వొదిలారు.
ఇది చూసిన సినిమా అభిమానులు ఆనందంలో మునిగారు. ప్రశాంత్ నీల్ స్టైల్ అఫ్ సినిమా టేకింగ్ నచ్చి చాల మంది నటులు ఆయనతో సినిమాలు చెయ్యాలని ట్రై చేస్తున్నారు కానీ ఆయన మాత్రం తన సినిమాలకు సెట్ అయ్యే హీరోలను ఎంచుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ తన సినిమాలలో దాదాపు స్టార్ చాష్త్ ను పెట్టుకుంటాడు.. ఇది మనకి తెలిసిన విషయమే. కేజిఎఫ్ రెండో భాగంలో విల్లన్ గా సంజయ్ దత్ ను పెట్టుకున్నాడు. అలానే ఇపుడు సాలార్ లోను తమిళ స్టార్ పృద్విరాజ్ ను ప్రత్యేక పాత్రలో తీసుకున్నారు. ప్రస్తుతం NTR 31 కూడా ఆయన ఇదే పద్దతి పాటిస్తునాడు అని ఓ వార్తా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అదేంటంటే, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం దర్శకుడు లోకనాయకుడు అయినా కమల్ హాసన్ (Kamal Hassan In NTR31) ను ఓకే చేశారట మరియు కమల్ డేట్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కమల్ ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ కే షూటింగ్ లో బిజీ గా ఉన్నారు మరియు ఆయన ఈ సినిమా అయిపోయాక ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కు వెళుదామని ప్లాన్ చేసుకుంటున్నారు అని తమిళ మీడియా లో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. దీనితో ఎన్టీఆర్ మరియు కమల్ హాసన్ ను ఒకే స్క్రీన్ మీద చూడాలని అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చుడాలిసిందే.