Home Cinema Prabhas : భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా ప్రభాస్.. ఫాన్స్ కు పూనకాలే..

Prabhas : భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా ప్రభాస్.. ఫాన్స్ కు పూనకాలే..

Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఎంత గొప్ప స్టార్ డమ్ ఉందొ అందరికి తెలుసు ఇదేమి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ పెద్దనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు లెగసె ని తన బుజాల పైన మోస్తూ తనను మించి స్టార్ హీరో అయ్యాడు. ఇది కృష్ణంరాజు గారికి చాలా గర్వాంగా ఉంది అని ఆయన స్టేజి మీద చెప్పారు. ప్రభాస్(Prabhas Vishnu Bhakta Kannappa) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

prabhas-acting-as-lord-shiva-in-vishnu-baktha-kannappa-cinema

ఈ సినిమా మొత్తం ఇండియా లోనే బారి విజయం అందుకుంది మరియు ప్రభాస్ కు ఇండియా మొత్తం అభిమానులు అయిపోయారు. ఆ తరువాత ప్రభాస్ తన మిత్రుడైన సుజిత్ తో సాహూ సినిమా చేసాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రభాస్ చేసిన సినిమాలు అన్ని అపజేయాలుగా మిగిలిపోయాయి. ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా బారి బడ్జెట్ తో తెరేకేక్కిన్చారు కానీ ప్రభాస్ కెరీర్ లోనే బారి డిసాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ప్రభాస్ అభిమానులు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు బారి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కల్కి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమ రెండు భాగాలుగా మన ముందుకు రాబోతుంది. ఈయన రెండు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇలా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయాడు. తన అభిమానులకు వచ్చే సంవత్సరం పండగ చెప్పాలి.

అయితే ఇటీవల ప్రభాస్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, మంచు విష్ణు సొంత బ్యానర్ పై తన డ్రీం ప్రాజెక్ట్ అయినా భక్త కన్నప్ప సినిమా తీస్తున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ప్రభాస్ ఈ సినిమాలో బోలా శంకరుడు అయినా శివుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించాడు.

ఇప్పుడు ఆయన శివుడి పాత్రలో కలిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తా పై ఇంకా అధికారిక ప్రకటన లేదు కానీ ఇది నిజం అయితే మాత్రం ప్రభాస్(Prabhas Vishnu Bhakta Kannappa) అభిమానులకు పండగ లాంటి సంవస్తరం అని చెప్పాలి.

Exit mobile version